Aadhar Card: బిగ్ అలర్ట్.. ఆధార్ కార్డులో భారీ మార్పులు.. ఇక దానికి చెల్లనే చెల్లదు

ఆధార్ కార్డులో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు పుట్టిన తేదీ ధృవీకరణకు ఆధార్ కార్డును ఉపయోగిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ డేట్ ఆఫ్ బర్త్‌ను నిర్ధారించడానికి దీనిని పరిగణలోకి తీసుకోలేమని కొన్ని రాష్ట్రాలు చెబుతున్నాయి. అందుకే బర్త్ సర్టిఫికేట్‌నే కరెక్ట్ అని అంటున్నాయి.

Aadhar Card: బిగ్ అలర్ట్.. ఆధార్ కార్డులో భారీ మార్పులు.. ఇక దానికి చెల్లనే చెల్లదు
Aadhar Supreme

Updated on: Dec 04, 2025 | 9:11 AM

Aadhar Card Updates: ఆధార్ కార్డు అనేది ఇండియాలో అప్పుడే పుట్టిన పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు అందరికీ అవసరమైన గుర్తింపు కార్డు. ఇది లేనిది ఏ పని జరగనంతగా పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రతీఒక్కరూ తమ పాకెట్‌లో ఎప్పుడూ ఆధార్ కార్డు ఉంచుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఇందులో మీ పేరు, అడ్రస్, బయోమెట్రిక్ డీటైల్స్ వివరాలన్నీ ఉండటంతో ఎప్పుడూ సురక్షితంగా భద్రపర్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతీదానికి ఈ కార్డును గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆధార్ కార్డుల్లో కొన్ని మార్పులు వచ్చాయి.

పుట్టిన తేదీ వెరిఫికేషన్‌కు గుర్తింపు కాదు

 

ఆధార్ కార్డును పుట్టిన తేదీ వెరిఫై చేయడానికి గుర్తింపు పత్రంగా ఉపయోగించకూడదని తాజాగా యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కాదని, దానిని ధృవీకరించడానికి ఉపయోగించవద్దని అన్ని డిపార్ట్‌మెంట్లకు తెలిపింది. డేట్ ఆఫ్ బర్త్ ధృవీకరణకు జనన ధృవీవకరణ పత్రం తప్పనిసరి అని స్పష్టం చేసింది. కొంతమందికి ఆధార్ కార్డులో ఒకలా.. ఇతర సర్టిఫికేట్స్‌లో మరోలా పుట్టిన తేదీ ఉంటుంది. దీని వల్ల కొంతమంది ప్రభుత్వ పథకాలను పొంది నిరూపయోగం చేస్తున్నారు. దీంతో UIDAI నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం పుట్టిన తేదీని నిర్ధారించడానికి ఆధార్ అర్హత పొందదని యూపీ ప్రభుత్వం తెలిపింది. రానున్న రోజుల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే రూల్‌ను తీసుకొచ్చే అవకాశముంది.

పుట్టిన తేదీ మార్చుకోండి

 

ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ముద్రించబడి ఉంటే మార్చుకునే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. ఇంతకముందు డేట్ ఆఫ్ బర్త్‌ను మార్చుకోవడానికి ఆధార్ కార్యాలయానికి తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అసవరం లేకుండానే కొత్తగా తీసుకొచ్చిన యాప్ ద్వారా సులువుగా ఇంటి వద్దనే మార్చుకోవచ్చు. ఆధార్ యాప్‌లోకి వెళ్లి అవసరమైన డాక్యుమెంట్ సమర్పించి అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. ఇక ఇతర వివరాలు సమర్పించాలి. మీరు సమర్పించిన వివరాలు కరెక్ట్‌గా ఉంటే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్‌ను మారుస్తారు.