
లక్నో, ఆగస్ట్ 30: ఒక్కోసారి అపార్ధం చేసుకోవడం మానవ సహజ లక్షణం. ఆనక అసలు విషయం తెలుసుకుని నాలుక కరచుకోవడం షరా మామూలే. తాజాగా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. సర్వే కోసం గూగుల్ మ్యాప్స్ బృందం ఒకటి తాజాగా ఓ గ్రామానికి వెళ్లింది. అక్కడ వారు ఫొటోలు తీసుకుంటూ కాస్త హడావిడి చేశారు. గమనించిన గ్రామస్తులు వీరిపై ఓ కన్నేశారు. ఆనక దొంలేమోననే అనుమానం వారిలో బలపడింది. అంతే.. గ్రామస్థులంతా కూడబలుక్కుని మూకుమ్మడి దాడి చేసి, గూగుల్ సర్వే టీమ్‌ను చితకబాదారు. చివరకు పోలీసులు రావడంత యవ్వారం సద్దుమణిగింది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో గురువారం (ఆగస్ట్ 28) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని బిర్హార్ గ్రామానికి గురువారం రాత్రిపూట టెక్ మహీంద్రా నుంచి గూగుల్ మ్యాప్స్ బృందం ఒకటి వెళ్లింది. ఈ క్రమంలో వారు వాహనాలపై అమర్చిన పరికరాలు, కెమెరాలతో ఆ గ్రామ రోడ్లను, వీధులను ఆ బృందం ఫొటోలు తీసి మ్యాపింగ్ చేస్తున్నారు. అయితే ఆ గ్రామస్తులకు వారి కెమెరా అమర్చిన వాహనంపై అనుమానం వచ్చింది. దొంగతనం చేయడానికి రెక్కి నిర్వహిస్తున్నట్లు భావించారు(ఆ గ్రామంలో తరచుగా దొంగతనాలు జరుగుతుంటాయిలేండి..).
🚨कानपुर : महोलिया के ग्रामीणों ने गूगल मैप कर्मियों को पीटा🚨
🆔 गूगल मैप कर्मियों को चोर समझ कर की पिटाई
🕵️♂️ टच महिंद्रा कंपनी के लिए युवक करते हैं काम
📸 जीपीएस टैगिंग के साथ करते हैं फोटो अपलोड
⚠️ क्षेत्र में हो रही चोरियों से ग्रामीणों में आक्रोश
💥 चोरों की कार समझकर रोककर… pic.twitter.com/XXiStwWyiN— भारत समाचार | Bharat Samachar (@bstvlive) August 28, 2025
కాసేపటికే గ్రామస్తుల గుంపులుగా చేసిర గూగుల్ మ్యాప్స్ బృందాన్ని చుట్టుముట్టి, వారి వాహనాన్ని అడ్డుకున్నారు. అంతే.. కొద్ది నిమిషాల్లోనే పరిస్థితి చేయిదాటింది. పాపం.. గూగుల్ మ్యాప్ టీంను దొరకబట్టి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకోవడంతో గొడవ సర్దుమనిగింది. సర్వే బృందాన్ని, గ్రామస్తులను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. గూగుల్ మ్యాప్స్ బృందం స్థానికులకు తాము దొంగలు కాదని, గ్రామాన్ని మ్యాప్ చేస్తున్నామని వివరించారు. సర్వే కోసం తాము DGP నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు తెలిపారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. గూగుల్ మ్యాప్స్ బృందం గ్రామస్తులపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. ఈ ఘటన తర్వాత పోలీసు బలగాలు సంఘటనా స్థలంలోనే మోహరించినట్లు కాన్పూర్ పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.