Viral: గూగుల్ మ్యాప్‎‎ను నమ్ముకుంటే కొంపముంచింది

గూగుల్ మ్యాప్‎‎ను నమ్ముకుంటే కొంపముంచింది. దారి చూపిస్తుందనుకుంటే నదిలోకి తీసుకెళ్లింది. రాజస్థాన్‌లోని చిత్తోర్ గడ్‌ లో గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌ను పూర్తిగా నమ్మిన ఫ్యామిలీ కారు నదిలో మునిగింది. ఐదుగురిని స్థానికులు రక్షించగా, నాలుగు మంది గల్లంతయ్యారు. నిపుణులు గూగుల్ మ్యాప్స్‌లో చూపించే రూట్స్‌ను పూర్తిగా నమ్మకూడదని, అవసరమైతే స్థానికుల సహాయాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

Viral: గూగుల్ మ్యాప్‎‎ను నమ్ముకుంటే కొంపముంచింది
Google Maps

Updated on: Aug 28, 2025 | 2:23 PM

ఇటీవల గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకున్నవారు దారి తప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. అయితే గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌ను గుడ్డిగా నమ్మకూడదని మరో ఉదంతం తెలియజేస్తోంది. రాజస్థాన్‌లోని చిత్తోర్ గడ్‌లోని నఖేడ గ్రామానికి చెందిన ఒక ఫ్యామిలీ.. భిల్వారాలోని సవాయిభోజ్ కు వెళ్లి అదేరోజు రాత్రి తిరుగుపయనమైంది. డెస్టినేషన్ రీచ్ అయ్యేందుకు గూగుల్ మ్యాప్స్ లో అడ్రస్ పెట్టుకోగా.. అదికాస్తా తప్పుగా చూపించింది. బనాస్ నదిపై ఉన్న సోమి – ఉప్రెడా కల్వర్ట్ పైకి కారు వెళ్లడంతో అక్కడ గొయ్యిలో పడిపోయింది. ఆపై నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి నదిలో మునిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతమంతా చీకటిగా ఉండటంతో స్థానికులు ప్రమాదాన్ని గ్రహించలేదు. ఆ కారులో ఉన్నవారు కాపాడాలని అరవడంతో.. వారి కేకలు విన్న స్థానికులు ఐదుగురిని రక్షించారు. మరో నలుగురు గల్లంతవ్వగా వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులున్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైనవారికోసం సహాయక చర్యలు చేపట్టారు. అయితే వరద ఉధృతి ప్రవాహం అధికంగా ఉందని.. దీనివల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. కల్వర్టును మూసివేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గూగుల్ మ్యాప్స్‌లో చూపించే రూట్స్ గుడ్డిగా నమ్మకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ యాప్‌ ఇచ్చే డైరెక్షన్స్ నమ్మి ఎంతోమంది ప్రమాదాల్లో పడ్డారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అందుకే పూర్తిగా యాప్‌పైనే ఆధారపడకుండా సరైన అడ్రస్ కోసం స్థానికుల సహాయం కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.