అప్పుడే పుట్టిన పిల్లలకు బర్త్‌ డే గిఫ్ట్‌గా బంగారు ఉంగరాలు.. అధినేతపై అభిమానం అలా చాటుకున్నారు..

|

Mar 01, 2022 | 6:16 PM

M. K. Stalin Birthday: సాధారణంగా బర్త్‌ డే గిఫ్ట్‌ అంటే.. చిన్న పిల్లలకు చాక్‌లేట్‌.. లేక పోతే కేక్‌ ఇస్తారు. ఇంకా చెప్పాలంటే.. చిన్న చిన్న బహుమతులు కూడా ప్రదానం చేస్తారు

అప్పుడే పుట్టిన పిల్లలకు బర్త్‌ డే గిఫ్ట్‌గా బంగారు ఉంగరాలు.. అధినేతపై అభిమానం అలా చాటుకున్నారు..
Representative Image
Follow us on

M. K. Stalin Birthday: సాధారణంగా బర్త్‌ డే గిఫ్ట్‌ అంటే.. చిన్న పిల్లలకు చాక్‌లేట్‌.. లేక పోతే కేక్‌ ఇస్తారు. ఇంకా చెప్పాలంటే.. చిన్న చిన్న బహుమతులు కూడా ప్రదానం చేస్తారు. కానీ తమిళనాడు (Tamilnadu) లో మాత్రం డిఫరెంట్‌గా గోల్డ్‌ రింగ్‌లు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆస్పత్రుల్లో అప్పుడే పుట్టిన పిల్లల వేలుకు బంగారు ఉంగరాలు తొడిగించారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ (M. K. Stalin) మంగళవారం (మార్చి1) పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు తమ అధినేత పుట్టిన రోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్‌ చేస్తున్నారు. పలుచోట్ల కేక్‌ కటింగ్‌తో పాటు విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని తిరువ‌ళ్లూరు జిల్లా డీఎంకే పార్టీ నేతలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అప్పుడే పుట్టిన శిశువుల‌కు బంగారు ఉంగరాలు బహుమతిగా అందించారు. డీఎంకే జిల్లా కన్వీనర్‌ భూప‌తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా ప‌రిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ బంగారు ఉంగరాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

కేసీఆర్‌, కేటీఆర్‌ల విషెస్‌..

ఇక స్టాలిన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. స్టాలిన్‌కు ఫోన్ చేసి విష్‌ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ వేదికగా డీఎంకే చీఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బ‌ర్త్ డే సార్’ అంటూ త‌మిళ్‌లో కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయురారోగ్యాలతో కలకాలం సుఖ సంతోషాలతో జీవించాలని, ప్రజాసేవలో తలమునకలు కావాలని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు కేటీఆర్ . వీరితో పాటు కమలహాసన్‌, రజనీకాంత్‌ తదితర ప్రముఖులు కూడా స్టాలిన్‌కు బర్త్‌ డే విషెస్‌ తెలిపారు.

Also Read:Ramarao on Duty: మాస్‌ మహరాజా ఫ్యాన్స్‌కు మహాశివరాత్రి సర్‌ప్రైజ్‌.. అలరిస్తోన్న రామారావు యాక్షన్‌ టీజర్‌..

తన కళ్ళతో కవ్విస్తూ యూత్ ను ఎట్రాక్ట్ చేస్తున్న ‘దివి’

ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ తెలంగాణ 2021′ అవార్డు అందుకున్న సమంత…