బంగారం ధర రికార్డు బద్దలు కొట్టింది. ఒకేసారి ఆల్‌టైం హై రేటుకు చేరుకుంది. దీంతో.. పసిడి ప్రియులు బిత్తరపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది నిజంగా వారికి షాకింగ్ కలిగించిన న్యూస్ అనే చెప్పాలి. రెండు నెలల్లోనే 5 వేలు పెరిగి రికార్డు క్రియేట్ చేసింది బంగారం. ఈ ఏడాది ప్రారంభంలో రూ.40 వేల ప్రారంభమైన గోల్డ్.. రెండు నెలలు ముగిసేసరికి రూ.5 వేలు పెరిగింది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్‌తో బంగారం కొనాలనుకేవారికి గట్టి షాకే తగిలింది.
అందులోనూ ఇప్పుడు పెళ్లిళ్ల ముహుర్తాలు ముమ్మరంగా ఉన్నాయి. దీంతో బంగారం కొనాలనుకునేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇది నిజంగా పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూసే. దీన్ని బట్టి చూస్తే.. మరికొద్ది రోజుల్లోనే.. అరలక్షకి బంగారం ధరలు చేరుతాయనడంలో ఎలాంటి సందేహం లేదని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కాగా ప్రస్తుతం.. హైదరాబాద్ మార్కెట్ ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,920లు కాగా, 22 క్యారెట్ల బంగారు ఆభరణాల ధర రూ.41,000లుగా ఉంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.43,050లు కాగా, 22 క్యారెట్ల పసిడి ఆభరణాల ధర రూ.41,850గా ఉంది. ఇక ముంబాయిలో కూడా గోల్డ్ రేట్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. 24 క్యారెట్ల బంగారు ధర రూ. 43,510 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.42,000గా ఉంది.