Kishan Reddy: భారత్‌ చేరుకున్న మహిమాన్విత అన్నపూర్ణ దేవి విగ్రహం.. ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

|

Nov 11, 2021 | 12:15 PM

Goddess Annapurna devi rare idol: దశాబ్దాల క్రితం దేశం నుంచి దొంగిలించబడిన దేవతా మూర్తుల విగ్రహాలను భారత ప్రభుత్వం మళ్లీ స్వదేశానికి తీసుకొస్తోంది. దీనిలో భాగంగా..

Kishan Reddy: భారత్‌ చేరుకున్న మహిమాన్విత అన్నపూర్ణ దేవి విగ్రహం.. ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..
Kishan Reddy
Follow us on

Goddess Annapurna devi rare idol: దశాబ్దాల క్రితం దేశం నుంచి దొంగిలించబడిన దేవతా మూర్తుల విగ్రహాలను భారత ప్రభుత్వం మళ్లీ స్వదేశానికి తీసుకొస్తోంది. దీనిలో భాగంగా.. వారణాసి నుంచి దొంగిలించబడిన అన్నపూర్ణ దేవి చారిత్రాత్మక, పురాతన విగ్రహాన్ని కెనడా నుంచి భారత ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ అరుదైన విగ్రహం 100 సంవత్సరాల క్రితం దొంగిలించబడినట్లు పేర్కొంటున్నారు. కెనడా నుంచి అన్నపూర్ణ దేవి విగ్రహం స్వదేశానికి చేరుకున్న అనంతరం పూజలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నపూర్ణా దేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, అధికారులు పాల్గొన్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.

భారతదేశ నాగరికత, సాంస్కృతిక వైభవాన్ని గౌరవించే రోజంటూ ఆయన ట్విట్ చేశారు. అన్నపూర్ణ దేవి మూర్తి విగ్రహం ఇప్పుడు సరైన చోటులో ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని ఊరేగింపుగా యూపీలోని కాశీ విశ్వనాథ ఆలయానికి తీసుకువెళ్లి అక్కడ పున:ప్రతిష్ట నిర్వహించనున్నట్లు తెలిపారు. కాశీ విశ్వనాథుని ఆలయంలో భక్తులు ఇకనుంచి అన్నపూర్ణ దేవి కృపను, ఆశీర్వచనాన్ని కూడా పొందవచ్చని కిషన్ రెడ్డి తెలిపారు. భారతదేశ సాంస్కృతిక రంగాన్ని కేంద్రం అభివృద్ధి చేస్తుందని తెలిపారు. గతంలో ఎవ్వరూ చేయలేని విధంగా ఎన్డీఏ సర్కార్ చారిత్రాత్మక విగ్రహాలను స్వదేశానికి తీసుకొస్తుందని తెలిపారు.

కాగా.. వందేళ్ల క్రితం దొంగలించబడిన అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని నవంబర్ 15న వారణాసిలోని ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో పున:ప్రతిష్టించనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పురాతన విగ్రహాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో యూపీ ప్రభుత్వానికి అప్పగించారు. కాగా.. ఎన్‌డీఏ హయాంలో ఇలాంటి 42 అరుదైన కళాఖండాలు, చారిత్రక విగ్రహాలను భారత ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకొచ్చినట్లు కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు.

Also Read:

Love Story: వీడు మామూలోడు కాదు.. లవర్‌కి డబ్బులిచ్చేందుకు కిడ్నాప్ డ్రామా.. షాకింగ్ న్యూస్..

ప్రియుడిని కలిసేందుకు ఇంటికెళ్లిన బాలికపై కన్ను.. ఆ తర్వాత లవర్ తండ్రి ఏం చేశాడంటే..?