కునాల్ పై ‘గో ఎయిర్’, ‘ఎయిరిండియా’, ‘స్పైస్ జెట్’ కూడా !

| Edited By: Pardhasaradhi Peri

Jan 29, 2020 | 7:10 PM

ఇండిగో విమానంలో ప్రయాణిస్తూ.. ఓ టీవీ యాంకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు కమెడియన్ కునాల్ కమ్రా పై ఇండిగో విమానయాన సంస్థతో బాటు ఎయిర్ ఇండియా, గో ఎయిర్, స్పైస్ జెట్ వైమానిక సంస్థలు కూడా నిషేధం విధించాయి. ఈ మేరకు ఇవి తమ తమ ట్వీట్లలో పేర్కొన్నాయి. ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిని ఉద్దేశించి కునాల్.. అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు మొదట వార్తలు వఛ్చిన సంగతి విదితమే. ఇందుకు ఇండిగో విమాన సంస్థ ఆరు నెలల […]

కునాల్ పై గో ఎయిర్, ఎయిరిండియా, స్పైస్ జెట్ కూడా !
Follow us on

ఇండిగో విమానంలో ప్రయాణిస్తూ.. ఓ టీవీ యాంకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు కమెడియన్ కునాల్ కమ్రా పై ఇండిగో విమానయాన సంస్థతో బాటు ఎయిర్ ఇండియా, గో ఎయిర్, స్పైస్ జెట్ వైమానిక సంస్థలు కూడా నిషేధం విధించాయి. ఈ మేరకు ఇవి తమ తమ ట్వీట్లలో పేర్కొన్నాయి. ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిని ఉద్దేశించి కునాల్.. అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు మొదట వార్తలు వఛ్చిన సంగతి విదితమే. ఇందుకు ఇండిగో విమాన సంస్థ ఆరు నెలల పాటు అతనిపై నిషేధం విధించింది.

ఆ తరువాత కొన్ని గంటలకే  గో ఎయిర్, ఎయిరిండియా, స్పైస్ జెట్ కూడా ఇదే చర్యను తాము సైతం  తీసుకున్నట్టు ప్రకటించాయి. అటు-పౌర విమాన యానశాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరి.. విమానంలో ప్రయాణిస్తున్నవారు ఎవరైనా రెచ్ఛగొట్టే వ్యాఖ్యలు చేసినా, గందరగోళ పరిస్థితులు సృష్టించినా సహించరాదని ట్వీట్ చేశారు. సంబంధిత వ్యక్తి (కునాల్) పై ఇతర వైమానిక సంస్థలు కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.