ఝార్ఖండ్ లో’ జురాసిక్ ‘ఆకులే శిలాజాలుగా మారినవేళ

| Edited By: Pardhasaradhi Peri

Sep 28, 2020 | 5:10 PM

ఝార్ఖండ్ సాహిబ్ గంజ్ జిల్లాలోని దూద్ కోల్ పర్వత ప్రాంతమది ! అక్కడ జియాలజిస్టులు విస్తృతంగా పరిశోధనలు జరుపుతుండగా విచిత్రమైన..

ఝార్ఖండ్ లో జురాసిక్ ఆకులే శిలాజాలుగా మారినవేళ
Follow us on

ఝార్ఖండ్ సాహిబ్ గంజ్ జిల్లాలోని దూద్ కోల్ పర్వత ప్రాంతమది ! అక్కడ జియాలజిస్టులు విస్తృతంగా పరిశోధనలు జరుపుతుండగా విచిత్రమైన..శిలాజాలుగా మారిన ఆకులు కనిపించాయి. సుమారు 20 సెం.మీ. పొడవు, 5 సెం.మీ. వెడల్పు ఉన్న ఇవి దాదాపు 150 నుంచి 200 మిలియన్ సంవత్సరాల క్రితం..జురాసిక్ కాలం నాటివిగా భావిస్తున్నఫు. వీటిని ‘జీనస్ టిలోఫిలం’ చెట్ల జాతులకు చెందినవిగా భావిస్తున్నారు. నాడు శాకాహారులైన డైనోసార్లు (రాకాసి బల్లులు) ఇష్టంగా తినేవని భావిస్తున్నట్టు  జియాలజిస్టులు చెబుతున్నారు. తమ తవ్వకాల్లో డైనోసార్ల గుడ్లను కూడా కనుగొన్నట్టు వారు చెప్పారు. దాదాపు పన్నెండు సంవత్సరాలుగా తామిక్కడ పరిశోధనలు చేస్తున్నట్టు వారు తెలిపారు.