గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్‌లో మంటలు..! హీరోగా మారిన లోకో పైలెట్‌

ముంబై నుండి ఢిల్లీ వెళ్తున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో రాజస్థాన్‌లోని బీవర్ సమీపంలో మంటలు చెలరేగాయి. లోకో పైలట్ సమయస్ఫూర్తితో ప్రమాదం తప్పింది. అతను వెంటనే రైలును ఆపి ఇంజిన్‌ను వేరుచేశాడు. ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు. అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసింది.

గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్‌లో మంటలు..! హీరోగా మారిన లోకో పైలెట్‌
Garib Rath Engine

Updated on: Jul 19, 2025 | 1:51 PM

ఈ ఉదయం రాజస్థాన్‌లోని బీవర్‌లో పెద్ద ప్రమాదం తప్పింది. ముంబై నుండి ఢిల్లీ వెళ్తున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ సుమారు 3 గంటల ప్రాంతంలో సెంద్ర రైల్వే స్టేషన్ గుండా వెళుతుండగా ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. ఇంజిన్ వెనుక భాగంలో పొగలు వస్తున్నట్లు గమనించిన లోకో పైలట్ వెంటనే అత్యవసర బ్రేక్‌లు వేసి రైలును ఆపేశాడు. ప్రయాణీకులలో భయాందోళనలు నెలకొన్నాయి, కానీ లోకో పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ముంబై నుండి ఢిల్లీకి వెళ్తున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో బీవార్ జిల్లాలోని సెంద్ర రైల్వే స్టేషన్ (అజ్మీర్ రైల్వే డివిజన్) వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత రైలు లోకో పైలట్ వెంటనే ఇంజిన్‌ను మిగిలిన రైలు కోచ్‌ల నుండి వేరు చేశాడు. దీంతో ప్రమాదం తప్పింది. అయితే ఇంజన్‌లో మంటుల ఎందుకు చెలరేగాయి అనే విషయం ఇంకా తెలియరాలేదు.

లోకో పైలట్‌కు ప్రశంసలు..

ఆ తర్వాత లోకో పైలట్ ఇంజిన్‌ను కొంచెం దూరం తీసుకెళ్లి ఆపాడు. లోకో పైలట్ సాహసోపేతమైన ఈ చర్య వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. రైలులోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. సంఘటన గురించి సమాచారం అందుకున్న బీవర్ ఆర్‌పిఎఫ్, సెంద్రా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తరువాత అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దాదాపు 3 గంటల పాటు శ్రమించి, మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ గరీబ్ రథ్ ముంబైలోని బాంద్రా, ఢిల్లీలోని సారాయ్ రోహిల్లా జంక్షన్ మధ్య నడుస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి