Crime News: డ్రగ్స్, గంజాయి రవాణాకు చెక్ పెట్టడం ఇప్పుడు సంబంధిత అధికారులకు, పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. రోజుకో కొత్త మార్గంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు స్మగ్లర్స్. ఈ గబ్బు పని కోసం అనువైన అన్ని మార్గాలను వినియోగించుకుంటున్నారు. ముందస్తు సమాచారం ఉంటే.. అధికారులు ఈ అక్రమ రవాణాను అడ్డుకోగలుకుతున్నారు. దేశవ్యాప్తంగా నిత్యం డ్రగ్స్, గంజాయి పట్టుబడుతున్న కేసులు మనం చూస్తూనే ఉన్నాం. ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రంలో కూడా భారీ ఎత్తున గంజాయి పట్టుబడుతుంది. తాజాగా 50 లక్షల విలువైన గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను జష్‌పూర్ జిల్లా(Jashpur District) తప్కారా పోలీసులు అరెస్టు చేశారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి ట్రక్‌లో సర్గుజాకు తరలిస్తున్నట్లు తెలిపారు. పోలీసులకు చిక్కకుండా స్మగ్లర్లు అతి తెలివి ప్రదర్శించారు. ఉప్పు బస్తాల లోడ్ అని చెప్పారు. పోలీసులు చెక్ చేసినప్పుడు అంతా ఉప్పే ఉంది. అయితే ఎందుకైనా మంచిదని అడుగున ఉన్న ఓ బస్తాను చెక్ చేయగా అందులో గంజాయిని బయటపడింది. పైన ఉప్పు బస్తాలు ఉంచి అడుగన గంజాయి సంచులు కనపడకుండా పెట్టినట్లు గుర్తించారు. ఒడిశా, జార్ఖండ్ సరిహద్దుల్లోని అడ్డంకి సమీపంలో పోలీసులు ఈ పికప్ ట్రక్‌ను పట్టుకున్నారు. నిందితులపై నార్కోటిక్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ విధించిన అనంతరం.. జైలుకు తరలించారు. ఒకరోజు ముందు కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..