Comeback Rally: కొంప ముంచిన ఫ్యాన్ ఫాలోయింగ్.. విడుదలైన కాసేపటికే మళ్లీ జైలుపాలైన గ్యాంగ్‌స్టర్

|

Jul 26, 2024 | 4:42 PM

జైలు నుంచి విడుదలైన ఆనందంలో ఓ గ్యాంగ్ స్టర్‌ చేసిన పనికి పీకల్లోతు చిక్కుల్లో ఇరుక్కున్నాడు. అతని అనుచరులు పెద్ద మొత్తంలో రోడ్లపైకి చేరుకుని ర్యాలీ నిర్వహించారు. అంతటితో ఆగకుండా ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా పోలీసులకంట పడటంతో కేసు నుంచి బయటపడ్డానన్న సంతోషం కాసేపు కూడా లేకుండానే మళ్లీ కటకటాల పాలయ్యాడు. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది...

Comeback Rally: కొంప ముంచిన ఫ్యాన్ ఫాలోయింగ్.. విడుదలైన కాసేపటికే మళ్లీ జైలుపాలైన గ్యాంగ్‌స్టర్
Gangster Comeback' Rally
Follow us on

ముంబై, జులై 26: జైలు నుంచి విడుదలైన ఆనందంలో ఓ గ్యాంగ్ స్టర్‌ చేసిన పనికి పీకల్లోతు చిక్కుల్లో ఇరుక్కున్నాడు. అతని అనుచరులు పెద్ద మొత్తంలో రోడ్లపైకి చేరుకుని ర్యాలీ నిర్వహించారు. అంతటితో ఆగకుండా ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా పోలీసులకంట పడటంతో కేసు నుంచి బయటపడ్డానన్న సంతోషం కాసేపు కూడా లేకుండానే మళ్లీ కటకటాల పాలయ్యాడు. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ హర్షద్‌ పాటంకర్‌ హత్యాయత్నం, దొంగతనాలు, డ్రగ్స్‌ దందా వంటి పల కేసుల్లో గతంలో అరెస్టయ్యాడు. ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం (MPDA) కింద కోర్టు అతడికి జైలు శిక్ష విధించబడింది. అయితే జులై 23న అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి అనుచరులు, అతడి విడుదలను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకునేందుకు రోడ్డుపై భారీ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో బేతేల్‌ నగర్‌ నుంచి అంబేద్కర్‌ చౌక్‌ వరకూ ‘కమ్‌ బ్యాక్‌’ బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గ్యాంగ్‌స్టర్ హర్షద్‌ సన్‌రూఫ్‌ కారులో అభివాదం చేసుకుంటూ వెళ్తుండగా.. అతడి కారు వెంట పలు కార్లు, సుమారు 15 బైకులు అతడిని అనుసరించాయి. తన మద్దతుదారులకు సన్‌ రూఫ్‌ కారులో నుంచి హర్షద్‌ చేతులు ఊపుతూ తన మద్ధతుదారులకు నమస్కారం చేస్తున్న వీడియోను “కమ్ బ్యాక్” అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

అదికాస్తా నెట్టింట వైరల్‌గామారి పోలీసుల కంటపడింది. దీంతో పోలీసులు హర్షద్‌పై చర్యలు చేపట్టారు. అనధికారిక ర్యాలీని నిర్వహించి గందరగోళం సృష్టించినందుకు పాటంకర్‌ను అతని ఆరుగురు అనుచరులపై కేసు నమోదవగా.. వారందరినీ మళ్లీ అరెస్టు చేసి జైలుకు పంపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.