Heroin Seized: లక్షద్వీప్ తీరంలో అక్రమంగా తరలిస్తున్న 218 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం.. రూ. 1,500 కోట్లు విలువ ఉంటుందని అంచనా..

|

May 21, 2022 | 1:32 PM

తమిళనాడులోని తీరం గుండా సముద్రంలోకి వెళ్లిన రెండు బోట్లు.. భారీ ఎత్తున డ్రగ్స్​ను తీసుకొచ్చినట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు మే 7న 'ఆపరేషన్​ ఖోజ్​బీన్​' చేపట్టాయి. ఈ నేపథ్యంలో సముద్రం తీరంలో నిరంతర పర్యవేక్షణ చేపట్టారు.

Heroin Seized: లక్షద్వీప్ తీరంలో అక్రమంగా తరలిస్తున్న 218 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం.. రూ. 1,500 కోట్లు విలువ ఉంటుందని అంచనా..
Heroin Seizure Lakshadweep
Follow us on

Heroin Seized: లక్షద్వీప్ తీరంలో మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్ల ముఠాను భారత ఏజెన్సీలు పట్టుకున్నాయి. అగట్టి తీరంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG), డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో 218 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ రూ. 1,500 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది డీఆర్​ఐ.

మే రెండోవారంలో తమిళనాడులోని తీరం గుండా సముద్రంలోకి వెళ్లిన రెండు బోట్లు.. భారీ ఎత్తున డ్రగ్స్​ను తీసుకొచ్చినట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు మే 7న ‘ఆపరేషన్​ ఖోజ్​బీన్​’ చేపట్టాయి. ఈ నేపథ్యంలో సముద్రం తీరంలో నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. ఆపరేషన్​లో భాగంగా ఐసీజీ షిప్​ సుజీత్​లో డీఆర్​ఐ అధికారులు.. దేశ ముఖ్యమైన ఆర్థిక జోన్​లో నిఘాను ఏర్పాటు చేశారు. రెండు అనుమానిత పడవలు ‘ప్రిన్స్’, ‘లిటిల్ జీసస్’ భారత తీరంలో కదులుతున్నాయని గుర్తించారు.

అనంతరం ఆపరేషన్ లో భాగంగా మే 18న ఆ రెండు బోట్లను డీఆర్​ఐ, ఐసీజీ అధికారులు లక్షద్వీప్​ ద్వీపాల్లోని తీరంలో అడ్డుకున్నారు. బోట్ల స్వాధీనం చేసుకున్నారు. వీటిని కొచ్చికి తరలించి తనిఖీ చేశారు. తనిఖీల్లో 218 కిలోల విలువైన  ప్యాకెట్ల హెరాయిన్​ లభ్యమైంది. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.1,526 కోట్లు ఉంటుంది పేర్కొన్నారు. ఎన్​డీపీఎస్​ చట్టం 1985 ప్రకారం అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివిధ ప్రదేశాలలో తదుపరి శోధనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..