G20 Summit 2023 in Delhi Highlights: జీ20 సమావేశాలకు విచ్చేసిన దేశాధినేతలు.. భద్రత నీడలో దేశ రాజధాని

| Edited By: Narender Vaitla

Sep 08, 2023 | 9:23 PM

G20 Summit 2023 Live Updates in Telugu: ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన దేశాల కూటమిగా నిలిచిన జీ-20 శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. రేపు, ఎల్లుండి జరిగే శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.అంతర్జాతీయ ఆర్థిక అంశాలతో పాటు ప్రపంచీకరణ బలోపేతంలో జీ20 దేశాల కూటమి కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచ ఆర్థిక సహకారానికి కీలక వేదికగా నిలిచే జీ-20 దేశాల ప్రతిష్ఠాత్మక సదస్సుకు తొలిసారి భారత్‌ ఆతిథ్యమిస్తోంది.

G20 Summit 2023 in Delhi Highlights: జీ20 సమావేశాలకు విచ్చేసిన దేశాధినేతలు.. భద్రత నీడలో దేశ రాజధాని
G20 Summit

G20 Summit 2023 Highlights Telugu: ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన దేశాల కూటమిగా నిలిచిన జీ-20 శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. రేపు, ఎల్లుండి జరిగే శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.అంతర్జాతీయ ఆర్థిక అంశాలతో పాటు ప్రపంచీకరణ బలోపేతంలో జీ20 దేశాల కూటమి కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచ ఆర్థిక సహకారానికి కీలక వేదికగా నిలిచే జీ-20 దేశాల ప్రతిష్ఠాత్మక సదస్సుకు తొలిసారి భారత్‌ ఆతిథ్యమిస్తోంది. ఈ మేరకు సర్వం సిద్ధం చేసింది. భద్రత నుంచి ఆతిథ్యం వరకు అన్నింటిని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రగతి మైదాన్‌లో నూతనంగా నిర్మించిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఉన్న భారత్ మండపంలో శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ మండపాన్ని లైటింగ్స్, పెయింటింగ్స్‌తో అలంకరించారు. మండప గేట్ దగ్గర నటరాజ విగ్రహం ఆకట్టుకుంటోంది. భారతీయ సంస్కృతిని చాటిచెప్పేలా ఓ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. G20 దేశాల సమావేశం ఒకవైపు. దీని నిర్వహణ సాఫీగా సాగేలా చూసేందుకు ఏర్పాట్లు మరోవైపు. దేశ రాజధాని ఇప్పుడు కనీవినీ ఎరుగని భద్రతా వలయంలో ఉంది. కీలక ప్రదేశాలను భద్రతా వ్యవైస్థలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ బలగాలు, స్పెషల్‌ ఫోర్సులు, సైన్యం, గూఢచారి విభాగం ఢిల్లీని కాపలా కాస్తున్నాయి.

G-20 సదస్సులో భాగంగా ఇవాళ ప్రధాని మోదీ, అమెరికా ప్రెసిడెంట్‌ జోసెఫ్‌ బైడెన్‌ భేటీకానున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై నేతలు చర్చించనున్నారు. రేపటి నుంచి రెండ్రోజులపాటు జరిగే జీ20 సదస్సు కోసం ఇప్పటికే అమెరికా నుంచి బయలుదేరిన బైడెన్.. మరికొద్దిగంటల్లో ఢిల్లీకి చేరుకోనున్నారు. G 20 సదస్సు కోసం భారత్ వచ్చే తొలి అతిథిగా బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ నిలవనున్నారు. ఆయన నేటి మధ్యాహ్నం 1.40కి వస్తారు. అలాగే మ.2:15కి ఢిల్లీకి జపాన్‌ ప్రధాని వస్తారు.. రాత్రికి చైనా, కెనడా ప్రధానులు చేరుకోనుండగా.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు రేపు ఢిల్లీకి వస్తారు.. అయితే.. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మాత్రం రావట్లేదు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Sep 2023 09:21 PM (IST)

    బైడెన్‌తో భేటీ అనంతరం ప్రధాని మోదీ ఈ ట్వీట్ చేశారు

    అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో భేటీ అనంతరం ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. మాకు, జో బిడెన్‌కు మధ్య జరిగిన చర్చలు ఫలవంతమైందని ప్రధాని అన్నారు. మన స్నేహం ప్రపంచానికి చాలా ముఖ్యమైనది అన్నారు.

  • 08 Sep 2023 08:42 PM (IST)

    మూడు రోజుల్లో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు

    ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ జుగ్‌నాథ్‌, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మరో మూడు రోజుల్లో ప్రధాని మోదీ 15 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించవచ్చని చెబుతున్నారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు పీఎం జగన్నాథ్, పీఎం హసీనా ఢిల్లీకి వచ్చారు.


  • 08 Sep 2023 08:30 PM (IST)

    ఢిల్లీకి చేరుకున్న టర్కీ అధ్యక్షుడు

    జీ 20 సదస్సు రేపు భారత్‌లో ప్రారంభం కానుంది. ఇందుకోసం టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కూడా శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.

  • 08 Sep 2023 08:18 PM (IST)

    ప్రధాని మోదీతో జో బైడెన్‌ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు

    ఢిల్లీలోని ప్రధాని నివాసంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమయ్యాయి. పలు అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి.

  • 08 Sep 2023 08:13 PM (IST)

    నేను హిందువునైనందుకు గర్విస్తున్నాను- రిషి సునాక్‌

    జీ20 సమ్మిట్‌లో దేశాధినేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఢిల్లీకి చేరుకున్న బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. తాను హిందువునైనందుకు గర్విస్తున్నానని సునాక్ అన్నారు.భారతీయ మూలాలపై ఆయన మీడియాతో తెలిపారు.

     

  • 08 Sep 2023 07:13 PM (IST)

    ఢిల్లీలో ల్యాండ్ అయిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

    ఢిల్లీలో రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు జీ 20 సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలకు చెందిన నేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇక తాజాగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఢిల్లీకి చేరుకున్నారు.

    Joe Biden

  • 08 Sep 2023 07:06 PM (IST)

    బంగ్లాదేశ్‌, మారిషస్‌ ప్రధానులతో మోడీ సమావేశం

    జీ 20 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పలువురు దేశాధినేతలతో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, మారిషస్ ప్రధాని అనిరోద్ జుగ్నాథ్‌తో మోడీ ద్వైపాక్షిక సమావేశాలలో చర్చించారు.

    బంగ్లాదేశ్ ప్రధానితో మోడీ..

     

    మారిషస్ ప్రధానితో మోడీ

  • 08 Sep 2023 05:01 PM (IST)

    రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్ డుమ్మా

    జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్ డుమ్మా కొట్టారు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం నెపంతో పుతిన్‌ డుమ్మా కొట్టారు. గల్వాన్‌ లోయ ఘటన అనంతర పరిస్థితుల్లో భారత్-చైనాల మధ్య సంబంధాలు పూర్తి స్థాయిలో ఇంకా మెరుగుపడకపోవడమే జిన్‌పింగ్‌ గైర్హాజరుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

  • 08 Sep 2023 04:45 PM (IST)

    ప్రత్యేకంగా క్రాఫ్ట్ బజార్ ఏర్పాటు

    విదేశీ అతిధుల కోసం.. జీ20 వేదిక అయిన భారత మండపం లోపల ప్రత్యేకంగా క్రాఫ్ట్ బజార్ ఏర్పాటు చేశారు. దేశంలోని అన్ని రకాల సంస్కృతీ, సాంప్రదాయాలకు సంబంధించిన ఎన్నో విశేషమైన వస్తువులను అక్కడ అందుబాటులో ఉంచారు.

  • 08 Sep 2023 04:13 PM (IST)

    ఢిల్లీకి చేరుకుంటున్న దేశాధినేతలు

    ఢిల్లీలో జీ20 సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు, ఎల్లుండి జరగబోతున్న సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రపంచ దేశాధినేతలు తరలివస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, జపాన్‌ ప్రధాని కిషిదా, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటొనియో గుటేరస్‌, అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో తదితరులు ఢిల్లీ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ 7 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు.

  • 08 Sep 2023 03:34 PM (IST)

    మీడియా సెంటర్‌ను మూడు భాగాలుగా ఏర్పాటు

    అంతర్జాతీయ మీడియా సెంటర్‌ను మూడు భాగాలుగా ఏర్పాటు చేశారు. దేశంలో ప్రవహించే మూడు ప్రధాన నదుల పేర్లను వాటికి పెట్టారు. మీడియా ప్రతినిధులు సులభంగా పనిచేసుకునే విధంగా అక్కడ ఏర్పాటు చేశారు.

  • 08 Sep 2023 03:33 PM (IST)

    మీడియా కోసం ప్రత్యేకంగా సెంటర్

    జీ20 శిఖరాగ్ర సదస్సు దగ్గర మీడియా కోసం ప్రత్యేకంగా సెంటర్ ఏర్పాటు చేశారు. లోకల్‌తో పాటు ఇంటర్నేషనల్ మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ఈ హాల్‌ని నిర్మించారు.

  • 08 Sep 2023 02:16 PM (IST)

    ఢిల్లీకి చేరుకున్న రిషి సునాక్‌

    ఢిల్లీలో జీ20 సమావేశాల్లో భాగంగా దేశ విదేశాల నుంచి అధ్యక్షులు, ప్రముఖులు విచ్చేస్తున్నారు. ఇక సమావేశాల్లో పాల్గొనేందుకు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.

  • 08 Sep 2023 01:18 PM (IST)

    భద్రతా వలయంలో దేశ రాజధాని

    G20 సమావేశాల సందర్భంగా ఢిల్లీని శత్రుదుర్భేద్యంగా మార్చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు ప్రత్యేకంగా ఫ్లాగ్‌ మార్చ్‌ చేపట్టారు. అలాగే టూవీలర్‌ పెట్రోలింగ్‌ చేపట్టారు. డ్రోన్లతో నిరంతరం నిఘాను పర్యవేక్షిస్తున్నారు. ఇలా ఢిల్లీ మొత్తం భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది..

  • 08 Sep 2023 01:11 PM (IST)

    ప్రత్యేక ఆకర్షణగా నటరాజస్వామి విగ్రహం

    ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపంలో ప్రత్యేక ఆకర్షణగా నటరాజస్వామి విగ్రహం నిలవనుంది.27 అడుగుల ఎత్తులో ఉన్న ఈ నటరాజ విగ్రహం దాదాపు 20 టన్నుల బరువు కలిగి ఉంది.సంప్రదాయ మైనపు పోత విధానంలో శిల్పశాస్త్ర కొలతలకు అనుగుణంగా ఈ విగ్రహాన్ని తమిళనాడులోని స్వామిమలైకి చెందిన స్థపతి రాధాకృష్ణన్‌ తయారు చేశారు.

  • 08 Sep 2023 12:54 PM (IST)

    కనీవినీ ఎరుగనిరీతిలో ఏర్పాట్లు..

    దేశాధినేతల కుటుంబ సభ్యుల కోసం కనీవినీ ఎరుగనిరీతిలో ఏర్పాట్లు చేసింది భారత్‌. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళల వైభవం తెలియజేస్తూ ఆతిథ్యం ఇవ్వబోతోంది. అద్భుతమైన భారతీయ వంటకాలను వాళ్లకు రుచి చూపించబోతోంది. ఇలా ఈసారి జీ20 సదస్సును సభ్య దేశాల అధినేతలు చిరకాలం గుర్తుంచుకునేలా భారత్ ఏర్పాట్లు చేసింది.

  • 08 Sep 2023 12:39 PM (IST)

    ఢిల్లీలో సందడి సందడి..

    జీ20 సదస్సుకు విదేశీ ప్రతినిధుల రాక ఇప్పటికే మొదలుకావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ మెగా ఈవెంట్‌కు యూరోపియన్‌ యూనియన్‌ నుంచి అధికారులు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు కానున్నారు.ఈ సదస్సు నిర్వహణను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.

  • 08 Sep 2023 12:25 PM (IST)

    సరికొత్తగా ఢిల్లీ..

    జీ20 సదస్సు కోసం దేశ రాజధాని ఢిల్లీ సరికొత్తగా మెరిసిపోతోంది. కలర్‌ఫుల్ లైట్లు, త్రీడీ ప్రదర్శనలు, వివిధ దేశాల జెండాలు, స్వాగత తోరణాలతో ఎప్పుడూ లేని విధంగా ఢిల్లీ సరికొత్తగా కనిపిస్తోంది..ఇలా జీ20 సదస్సు కోసం భారత్ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసింది..ఒక రకంగా వచ్చిన వారికి పండుగ వాతావరణం కనిపించనుంది.

  • 08 Sep 2023 11:59 AM (IST)

    జీ-20.. ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్‌..

    మూడు రోజులపాటు ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్‌లో ఉండనున్నారు. 15 ధ్వైపాక్షిక సమావేశాల్లో మోదీ పాల్గొంటారు. ఇవాళ అమెరికా, మారిషస్, బంగ్లాదేశ్‌ అధినేతలతో భేటీ కానున్నారు. రేపు జీ-20 సదస్సుతో పాటు యూకే, జపాన్‌, జర్మనీ, ఇటలీ దేశాధినేతలతో విడిగా భేటీకానున్నారు. ఆదివారం ఫ్రాన్స్‌ అధ్యక్షుడితో మోదీ వర్కింగ్ లంచ్.. అనంతరం విడిగా కెనడా దేశాధినేతతో సమావేశం కానున్నారు. అలాగే.. కొమొరోస్, టర్కీ, యూఏఈ, దక్షిణ కొరియా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, నైజీరియా అధినేతలతో ప్రధాని చర్చలు జరుపుతారు.

  • 08 Sep 2023 11:13 AM (IST)

    మన చరిత్ర, సంస్కృతి మాత్రమే కాదు..

    ఢిల్లీలో మన చరిత్ర, సంస్కృతి మాత్రమే కాదు, G20 దేశాల చరిత్ర కూడా చాటిచెబుతున్నారు. ఈ దేశాల జాతీయ పక్షులను ఒక పార్కులో ఏర్పాటు చేశారు. లోహంతో వీటిని తయారుచేశారు. G20 సదస్సు కోసం వచ్చే అతిథులకు భారత సంగీత ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. రోడ్లపక్కన, పార్కుల్లో ప్రత్యేక శిల్పాలను ఏర్పాటు చేశారు.

  • 08 Sep 2023 10:49 AM (IST)

    అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ చేరుకునేది ఎప్పుడంటే..

    G-20 సదస్సులో భాగంగా ఇవాళ సాయంత్రం నాటికి అమెరికా ప్రెసిడెంట్‌ జోసెఫ్‌ బైడెన్‌ భారత్ కు చేరుకోనున్నారు. ఢిల్లీకి చేరుకున్న అనంతరం ప్రధాని మోదీ, అమెరికా ప్రెసిడెంట్‌ జోసెఫ్‌ బైడెన్‌ సమావేశం కానున్నారు.

  • 08 Sep 2023 10:44 AM (IST)

    మొదట చేరుకునేది రుషి సునాకే..

    G20 సదస్సు కోసం బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ శుక్రవారం మధ్యాహ్నం 1.40కి రానున్నారు. అలాగే మ.2:15కి ఢిల్లీకి జపాన్‌ ప్రధాని వస్తారు. రాత్రికి చైనా, కెనడా ప్రధానులు చేరుకోనున్నారు.

  • 08 Sep 2023 10:43 AM (IST)

    అతిథుల రాకపోకల కోసం హిండన్ ఎయిర్ బేస్ వినియోగం..

    G20 సమ్మిట్‌ సందర్భంగా భారత్‌ వస్తున్న అతిథుల రాకపోకల కోసం హిండన్ ఎయిర్‌బేస్ వినియోగించబోతున్నారు.70కి పైగా వీవీఐపీ జెట్‌లు సమ్మిట్ కోసం ఢిల్లీ విమానాశ్రయంలో దిగనున్నాయి.. దీంతో హిండన్ ఎయిర్ బేస్ దగ్గర నుంచి భారత మండపం వరకు.. ఎయిర్ పోర్స్ బృందాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి.

Follow us on