ఆ ఐదు ఎన్నికల రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల పరిస్థితి ఏంటి ?ఎవరికి ఎదురీత? ఎవరికి నల్లేరుపై నడక?

కరుణానిధి వారసత్వాన్ని అందిపుచ్చుకుని, తనదైన 'ద్రవిడ మోడల్' పాలనతో దూసుకుపోతున్న సీఎం స్టాలిన్‌కు ఈ 2026 ఎన్నికలు కచ్చితంగా అగ్నిపరీక్షే. ఒకవైపు సంక్షేమ పథకాల జల్లు.. మరోవైపు 'దళపతి' విజయ్ రూపంలో దూసుకొస్తున్న సరికొత్త పొలిటికల్ ఫైట్. అన్నాడీఎంకే పట్టుదల-బీజేపీ స్పీడు.. వీటి మధ్య స్టాలిన్ తన కోటను ఎలా కాపాడుకోబోతున్నారు? ఇది కేవలం ఎన్నిక మాత్రమే కాదు.. స్టాలిన్ రాజకీయ చాణక్యానికి, ఉదయనిధి భవిష్యత్తుకు అసలైన రిపోర్ట్ కార్డ్! తమిళనాట 'ద్రవిడ సూర్యుడు' మళ్లీ ఉదయిస్తాడా?

ఆ ఐదు ఎన్నికల రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల పరిస్థితి ఏంటి ?ఎవరికి ఎదురీత? ఎవరికి నల్లేరుపై నడక?
Tamil Nadu election analysis

Updated on: Mar 28, 2026 | 10:00 PM

తమిళనాట స్టాలిన్ విజయం దాదాపు ఖాయమే అని సర్వేలు చెబుతున్నా.. విక్టరీని అంత ఈజీగా చేతికి అప్పగించే పరిస్థితి లేదంటున్నారు. ద్రవిడ మోడల్ పాలన, మహిళా ఓటర్ల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు స్టాలిన్‌కు బలమైన పునాదిని ఇచ్చాయి. తండ్రి కరుణానిధి వారసత్వాన్ని కొనసాగిస్తూనే, తమిళ జాతి హక్కుల పరిరక్షణ’ నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నారు స్టాలిన్. దాదాపు 60 ఏళ్లుగా తమిళనాట అమలవుతూ వస్తున్న ద్రావిడ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో సక్సెస్ అయ్యారు స్టాలిన్. ఇది డీఎంకే కూటమికి అతిపెద్ద ప్లస్ పాయింట్. పైగా ద్రవిడ శక్తులన్నిటినీ కూడగట్టగలిగారు కరుణానిధి కుమారుడు. అన్నాడీఎంకే పోటీ చేస్తున్న సీట్ల కంటే.. స్టాలిన్ పార్టీ డీఎంకే పోటీ చేస్తున్న స్థానాలే తక్కువ. తన మిత్రపక్షాల కోసం స్టాలిన్ ఇంతలా దిగొస్తారని ఎవరూ ఊహించలేదు. అన్నాడీఎంకే బహిహృత నేత, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం కొత్త పార్టీ పెట్టి, ఈమధ్యే డీఎంకేలో చేరారు. ఇది స్టాలిన్‌ కూటమికి అదనపు బలం. కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ స్థాపించిన డీఎండీకే కూడా ఈమధ్య డీఎంకే కూటమిలో చేరింది. అంటే.. ద్రవిడ శక్తుల పునాది మరింత విస్తరించినట్టయింది. మరోవైపు గతంలో రెండుసార్లు ఒంటరిగా పోటీ చేసి, ఘోర పరాభవం మూటగట్టుకున్న కాంగ్రెస్.. ఈసారి డీఎంకే గూటికి చేరింది. మొదట 40కి పైగా సీట్లు కావాలని అడిగి.. ఎన్నిస్తే అన్నే తీసుకుంటాం అని స్టాలిన్ ముందు కాంప్రమైజ్ అయింది. ఓవరాల్‌గా డీఎంకే కూటమికి విజయావకాశాలను...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి