ఇండియాకు రఫెల్ విమానాల అమ్మకంపై ఫ్రాన్స్ లో విచారణ ! నిజంగా అవినీతి జరిగిందా..?

| Edited By: Phani CH

Jul 03, 2021 | 2:13 PM

ఇండియాకు రఫెల్ విమానాల అమ్మకం మళ్ళీ వివాదాస్పదమవుతోంది. 2016 నాటి ఈ కోట్లాది డాలర్ల డీల్ పై ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యతను ఫ్రాన్స్ లో ఓ జడ్జికి అప్పగించారు.

ఇండియాకు రఫెల్ విమానాల అమ్మకంపై ఫ్రాన్స్ లో విచారణ ! నిజంగా  అవినీతి జరిగిందా..?
Rafale Planes
Follow us on

ఇండియాకు రఫెల్ విమానాల అమ్మకం మళ్ళీ వివాదాస్పదమవుతోంది. 2016 నాటి ఈ కోట్లాది డాలర్ల డీల్ పై ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యతను ఫ్రాన్స్ లో ఓ జడ్జికి అప్పగించారు. ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందన్న అనుమానాలు ఉన్నాయని అక్కడి నేషనల్ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్ల కార్యాలయం తాజాగా నిర్ధారించింది. భారత ప్రభుత్వానికి, ఫ్రెంచ్ వైమానిక సంస్థ ధసాల్ట్ కు మధ్య 2016 లో 7.8 బిలియన్ యూరోల (9.3 బిలియన్ డాలర్ల) మేర వీటి కొనుగోలుకు సంబంధించి డీల్ కుదిరింది. అయితే ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ అమ్మకంపై దర్యాప్తు జరిపేందుకు ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్ల కార్యాలయం నిరాకరించింది. దీంతో ఫ్రెంచ్ ఇన్వెస్టిగేటివ్ వెబ్ సైట్ ..’మీడియా పార్ట్’..దీన్ని తప్పు పట్టింది. ఇందుకు సంబంధించిన డీల్ లో అనుమానాస్పద వ్యక్తుల పాత్రను కప్పి పుచ్చడానికి అవినీతి నిరోధక శాఖ యత్నిస్తోందని ఈ సైట్ ఆరోపించింది. విమానాల అమ్మకాన్ని ఖరారు చేసుకునేందుకు ధసాల్ట్ సంస్థ కోట్లాది యూరోలను కమీషన్లుగా ఇచ్చిందని..వీటిలో కొన్ని నిధులను భారతీయ అధికారులకు కూడా ముడుపులుగా చెల్లించి ఉండవచ్చునని ఈ సైట్ పేర్కొంది. (కానీ ఇందులో ఫ్రాడ్ జరగలేదని..గ్రూప్ ఆడిట్లు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయని దసాల్ట్ సంస్థ స్పష్టం చేసింది..ఈ ఆరోపణలను తోసిపుచ్చింది). ఏమైనా,.. ఈ డీల్ లో అవినీతి జరిగిందంటూ షెర్పా ఎన్జీఓ అనే మరో సంస్థకూడా అధికారికంగా ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణకు ఆదేశించాలని కోరింది. ఆర్ధిక నేరాల విషయంలో ఈ ఎంజీవో ఈ విధమైన అంశాలను వెలుగులోకి తెస్తుంటుంది.

ఈ అమ్మకపు ఒప్పందంపై ఇన్వెస్టిగేషన్ జరపాలని ఈ సంస్థ 2018 లో కూడా కోరగా ఫైనాన్సియల్ ప్రాసిక్యూటర్ల కార్యాలయం మౌనం వహించింది. తొలుత 126 రఫెల్ విమానాలను ఇండియాకు అమ్మెందుకు అనువుగా దసాల్ట్ సంస్థ 2012 లో ఇండియన్ ఏరో స్పేస్ కంపెనీ… హిందుస్థాన్ ఏరోనాటిక్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 2015 మార్చిలో ఈ సంప్రదింపులు ఓ కొలిక్కి వచ్చాయి. అయితే అదే ఏడాది ఏప్రిల్ లో ప్రధాని మోదీ ఫ్రాన్స్ ను విజిట్ చేయగా ఆ చర్చలు హఠాత్తుగా స్తంభించిపోయాయి. కాగా ఆ తరువాత హెచ్ఏఎల్ స్థానే రంగంలోకి దిగిన రిలయన్స్ గ్రూప్-36 జెట్ విమానాలకొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. ఈ రఫెల్ ప్లేన్ల కొనుగోలులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

 

మరిన్ని ఇక్కడ చూడండి: India Vs Srilanka: ‘భారత్‌తో సిరీస్ మేము ఆడం” కాంట్రాక్టుపై సంతకం చేయని శ్రీలంక క్రికెటర్లు..

‘ఎండిపోయిన లావా ”రాతికోట” లా మారిపోయిందే ! మహారాష్ట్రలో నాటి అగ్నిపర్వత విస్ఫోట ఫలితం ?