Free Silai Machine Yojana 2022: ఈ పథకం ద్వారా ‘కుట్టు మిషన్’ ఉచితంగా పొందండి.. పూర్తి వివరాలివే..

|

Dec 07, 2022 | 1:22 PM

మహిళల స్వావలంబన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. కొత్త పథకాలను తీసుకువస్తున్నాయి. నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనాలు అందించడం..

Free Silai Machine Yojana 2022: ఈ పథకం ద్వారా ‘కుట్టు మిషన్’ ఉచితంగా పొందండి.. పూర్తి వివరాలివే..
Free Silai Machine
Follow us on

మహిళల స్వావలంబన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. కొత్త పథకాలను తీసుకువస్తున్నాయి. నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనాలు అందించడం కోసం ఈ పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప పథకాన్ని అమలు చేస్తోంది. ఉచిత కుట్టు మిషన్ పంపిణీ పథకం. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తుంది. ఇది పూర్తిగా ఉచితం. అయితే, అర్హత కలిగిన మహిళలకే ఈ పథకం కింద కుట్టు మిషన్లను పంపిణీ చేస్తారు. అర్హతలను బట్టి మహిళలు దరఖాస్తు చేసుకుంటే, ప్రభుత్వం వారికి కుట్టు మిషన్లను మంజూరు చేస్తుంది. మరి ఈ ఉచిత కుట్టు మిషన్లు పొందాలంటే అర్హతలు ఏంటి? ఎలాంటి దరఖాస్తు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలను ఇక్కడ మనం తెలుసుకుందాం..

ఈ పథకానికి అర్హతలు..

⇒ 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు

⇒ కూలీపని చేసుకునేవారు, కుటుంబ ఆదాయం రూ. 12 వేలకు మించకూడదు.

ఇవి కూడా చదవండి

⇒ గ్రామీణ, నగరాల్లో నివసించే పేద మహిళలు ఈ పథకానికి అర్హులు.

⇒ ఆర్థికంగా బలహీనులైన మహిళలు ఈ పథకానికి అర్హులు.

దరఖాస్తు ఇలా చేసుకోవాలి..

1. ఉచితంగా కుట్టు మిషన్ పొందాలంటే.. ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.india.gov.inకి వెళ్లాలి.

2. ఆ తరువాత ఇక్కడ ఉచిత కుట్టు మిషన్ పథకానికి సంబంధించి అప్లికేష్ ఉంటుంది. ఆ ఫామ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆపై దాన్ని నింపాలి. నింపిన ఫామ్‌తో పాటు అవసరమైన సర్టిఫికెట్లను జతపరచాలి.

3. ఫామ్, సర్టిఫికెట్లను జత చేసి సంబంధిత కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. ఈ దరఖాస్తును పరిశీలించి, అధికారులు ఓకే చేస్తే ఉచితంగా కుట్టు మిషన్ మంజూరు అవుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..