Fourth Wave Scare: నాలుగో వేవ్ భయాలు.. మాస్క్ ధారణపై పంజాబ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు

|

Apr 21, 2022 | 2:39 PM

దేశంలో గత రెండు రోజులుగా రెండు వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.  త్వరలోనే దేశంలో నాలుగో వేవ్ రావచ్చొని కొందరు వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు.

Fourth Wave Scare: నాలుగో వేవ్ భయాలు.. మాస్క్ ధారణపై పంజాబ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు
Mask
Follow us on

Corona Fourth Wave Fears: దేశంలో గత రెండు రోజులుగా రెండు వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క దేశ రాజధాని ఢిల్లీలోనే వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో  త్వరలోనే దేశంలో నాలుగో వేవ్ రావచ్చొని కొందరు వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ల వాడకాన్ని తప్పనిసరి చేస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. మాస్క్ వాడని పక్షంలో రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. తాజాగా పంజాబ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో అలెర్ట్ అయ్యింది. జనరద్దీ కలిగిన ప్రాంతాల్లో మాస్క్‌ను తప్పనిసరిగా వాడాలంటూ అక్కడి భగవంత్ మాన్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రజా రవాణా వ్యవస్థలైన బస్సులు, రైళ్లు, విమానాలు, ట్యాక్సీల్లో మాస్క్ ధరించాలని పంజాబ్ ప్రభుత్వం ఆదేశించింది. అలాగే సినిమా థియేటర్లు, షాకింగ్ మాల్స్, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లోనూ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి. అలాగే తరగతి గదులు, ఆఫీస్ గదులు, ఇండోర్‌లో జరిగే సామూహిక కార్యక్రమాల్లోనూ మాస్క్‌ను విధిగా ధరించాలంటూ పంజాబ్ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాగ్ వర్మ ఆదేశాలు జారీ చేశారు.

Also Read..

RK Roja: మంత్రి రోజా ఫోన్ చోరీ..సెల్ ఫోన్ల గురించి రోజా వివరిస్తున్న సమయంలోనే

EPFO: ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్‌ డబ్బుల విషయంలో కంపెనీ చుట్టు తిరుగుతున్నారా? ఆ పని మీరే చేసుకోవచ్చు.. ఎలాగంటే!