జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. విట్రిగామ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో.. భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే భద్రతా సిబ్బందిని గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులు హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబాకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలం నుంచి మరో ముగ్గురు ఉగ్రవాదులు తప్పించుకోవడంతో వారి కోసం.. సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు గాలింపు చేపడుతున్నాయి.
Jammu and Kashmir: Four terrorists have been killed by security forces and police at Dialgam village in Anantnag district. pic.twitter.com/HmllhocgD9
— ANI (@ANI) March 15, 2020