పంజాబ్ అసెంబ్లీలో ‘కరోనా వైరస్ స్వైర విహారం’, 33 మంది సభ్యులకు పాజిటివ్

| Edited By: Anil kumar poka

Sep 03, 2020 | 1:52 PM

పంజాబ్ అసెంబ్లీలో మరో నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ సోకిందని సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు దీనికి గురైన వారి సంఖ్య 33 కి పెరిగిందన్నారు.

పంజాబ్ అసెంబ్లీలో కరోనా వైరస్ స్వైర విహారం, 33 మంది సభ్యులకు పాజిటివ్
Follow us on

పంజాబ్ అసెంబ్లీలో మరో నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ సోకిందని సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు దీనికి గురైన వారి సంఖ్య 33 కి పెరిగిందన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో 117 స్థానాలు ఉన్నాయి. తమ మంత్రి మండలిలో అయిదుగురు మంత్రులు కూడా పాజిటివ్ బారిన పడ్డారని అమరేందర్ సింగ్ తెలిపారు. అయితే ఇది సోకినంత మాత్రాన ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని,  స్టే హోం , క్వారంటైన్ వంటి వాటిద్వారా దీన్ని జయించవచ్ఛునని అన్నారు. కాగా- దేశంలో ఓ వైపు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ గానీ ఒక్క ప్రకటనా చేయకపోవడం విశేషం.