ముగ్గురు అమ్మాయిలతో, అబ్బాయి.. హద్దుమీరి ఇన్‌స్టా రీల్స్‌.. సీన్ కట్ చేస్తే.!

ఫేమస్‌ అవ్వడం, ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు కొందరు యువతులు తమ ఇన్‌స్ట్రా అకౌంట్‌లో అసభ్యకర వీడియోలు పోస్ట్‌ చేస్తూన్నారన్న ఫిర్యాదుతో ముగ్గురు యువతులతో పాటు ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

ముగ్గురు అమ్మాయిలతో, అబ్బాయి.. హద్దుమీరి ఇన్‌స్టా రీల్స్‌.. సీన్ కట్ చేస్తే.!
Obscene Reels

Updated on: Jul 16, 2025 | 1:53 PM

సోషల్‌ మీడియా ప్రభావం యువతపై ఎంతలా పడిందంటే.. కొందరు యువతులు ఫేమస్‌ అవ్వడం కోసం అసభ్యకరంగా వీడియోలు చిత్రీకరించి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు. తాజాగా ఇలానే ఫేమస్‌ అయ్యేందుకు ప్రయత్నించిన ఓ ముగ్గురు యువతులు, ఒక యువకుడిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది అమ్మాయిలు అశ్లీలమైన, అభ్యంతరకరమైన కంటెంట్‌తో వీడియోలు, రీల్స్ అప్‌లోడ్ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని సంభాల్ ఎస్పీ కృష్ణ కుమార్ విష్ణోయ్ తెలిపారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సదురు యువతులపై చర్యలు తీసుకుని వారి ఇన్‌స్టా అకౌంట్‌ను బ్లాక్ చేశారు.

అయితే సంభల్‌ జిల్లాకు చెందిన ఈ నలుగురు అసభ్య కంటెంట్‌ను క్రియేట్‌ చేసి దాన్ని మహక్ పరిచ 143’ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ ద్వారా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.వీరు చేస్తున్న అసభ్యకర రీల్స్‌ కారణంగా వారి గ్రామం పేరే కాకుండా.. జిల్లాకు కూడా చెడ్డపేరు వస్తుందని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ ఐడీని మెహ్రుల్ నిషా అలియాస్ పారి అనే యువతితో పాటు మరో ముగ్గురు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫాలోవర్స్‌ను పెంచుకొని.. ఫేమస్‌ అయ్యి.. దాని ద్వారా డబ్బులు సంపాధించేందుకు వీరు ఇలాంటి కంటెంట్‌ను ఇన్‌స్టా గ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్టు పోలీసు దర్యాప్తులో గుర్తించారు.

మహక్ పరిచ 143 అనే అకౌంట్‌లో వీరు ఇప్పటి వరకు 546 వీడియోలు అప్‌లోడ్ చేసి.. 4 లక్షలకుపైగా ఫాలోవర్సును పొందినట్టు పోలీసులు గుర్తించారు.
అంతేకాదు వీరు ఈ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా ప్రతి నెలా దాదాపు 25,000 రూపాయల వరకు సంపాదిస్తున్నారని తెలిపారు. దీంతో వీరిపై ఐటీ యాక్ట్‌ సెక్షన్ 67,BNS చట్టంలోని 294B సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసుపై స్థానిక ఎస్పీ బిష్ణోయ్ మాట్లాడుతూ సామాజికంగా అసభ్యతను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఇలాంటి వీడియోల ద్వారా సమాజంలోకి చెడు సంకేతాలు వెళ్తున్నాయని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.