Viral Video :కాస్ట్లీగా కారులో వచ్చిన దుండగులు.. కేవలం 8 నిమిషాల్లో నాలుగు పెట్రోల్‌ పంపులు లూటీ చేశారు..

|

Dec 12, 2022 | 8:46 PM

దేశంలో అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారులలో ఒకటి . సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. పెట్రోలు పంప్ నిర్వాహకుల్లో భయాందోళనల నెలకొంది.

Viral Video :కాస్ట్లీగా కారులో వచ్చిన దుండగులు.. కేవలం 8 నిమిషాల్లో నాలుగు పెట్రోల్‌ పంపులు లూటీ చేశారు..
Petrol Pumps Loot
Follow us on

హర్యానాలోని ఢిల్లీ-జైపూర్ హైవేపై నిఖ్రి గ్రామ సమీపంలోని రేవారిలో దోపిడీ దొంగలు హల్‌చల్‌ చేశారు. కారులో వచ్చిన నలుగురు దుండగులు ఒకదాని తర్వాత ఒకటి తుపాకీతో నాలుగు పెట్రోల్ పంపులను దోచుకున్నారు. 1.27 లక్షలు దోచుకుని దుండగులు పరారయ్యారు. కేవలం 8 నిమిషాల వ్యవధిలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రేవారీలోని నాలుగు పెట్రోల్‌ పంపులను నలుగురు సభ్యులతో కూడిన దొంగల ముఠా లూటీ చేసింది. ఆదివారం అర్థరాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఫుటేజీలో, దుండగులు చేతిలో పిస్టల్ పట్టుకుని కనిపించారు. అదే సమయంలో నేరుగా పెట్రోల్ పంపు వద్దకు చేరుకుని సేల్స్ మాన్ గుడిపై పిస్టల్ పెట్టి దోపిడీకి పాల్పడి పరారయ్యారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. పెట్రోలు పంప్ నిర్వాహకుల్లో భయాందోళనల నెలకొంది. ఢిల్లీ జైపూర్ హైవేలోని రేవారీపై దోపిడీ ఘటన వెలుగులోకి రావడంతో పెట్రోల్ పంప్ నిర్వాహకుల్లో భయాందోళన నెలకొంది.

ఇవి కూడా చదవండి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి హైవేపై నాలుగు పెట్రోలు పంపులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలో షహీద్ వీరేంద్ర పెట్రోల్ పంపులో 40 వేలు, రెండో పెట్రోల్ పంపులో 27 వేలు, మూడో పెట్రోల్ పంపులో 10 వేలు, నాల్గవ పెట్రోల్ పంపులో 50 వేలు దోచుకెళ్లి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ-జైపూర్ హైవేపై అనేక పోలీసు స్టేషన్‌ల పోలీసు అధికారులు అగంతకుల కోసం దాడులు నిర్వహిస్తున్నారు.

ఢిల్లీ జైపూర్ హైవే దేశంలో అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారులలో ఒకటి. అటువంటి పరిస్థితిలో, ఢిల్లీ-జైపూర్ హైవేపై వందలాది పెట్రోల్ పంపులు పనిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దోపిడి ఘటన తెరపైకి రావడంతో పెట్రోల్ పంపు నిర్వాహకుల్లో భయాందోళన నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి