పండుగ పూట విషాదం.. బీజేపీ మాజీ అధ్యక్షుడు మృతి

దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు జరుపుకుంటున్న వేళ.. పంజాబ్ బీజేపీ నేతల్లో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ శర్మ.. ఇవాళ ఉదయం ఫిరోజ్‌పూర్‌లో గుండెపోటుతో మృతిచెందారు. రోజులాగే ఇవాళ ఉదయం మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన కమల్‌ శర్మకు.. హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన సన్నిహితులు అక్కడి నుంచి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలించే లోపే ఆయన శ్వాసనిలిచిపోయిందని వైద్యులు నిర్ధారించారు. కమల్ శర్మకు భార్య, […]

పండుగ పూట విషాదం.. బీజేపీ మాజీ అధ్యక్షుడు మృతి

Edited By:

Updated on: Oct 27, 2019 | 11:11 PM

దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు జరుపుకుంటున్న వేళ.. పంజాబ్ బీజేపీ నేతల్లో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ శర్మ.. ఇవాళ ఉదయం ఫిరోజ్‌పూర్‌లో గుండెపోటుతో మృతిచెందారు. రోజులాగే ఇవాళ ఉదయం మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన కమల్‌ శర్మకు.. హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన సన్నిహితులు అక్కడి నుంచి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలించే లోపే ఆయన శ్వాసనిలిచిపోయిందని వైద్యులు నిర్ధారించారు. కమల్ శర్మకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కమల్ శర్మ అకాల మరణం పట్ల.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ, బీజేపీ పార్టీ జాతీయ కార్యాధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ నేతలు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  కాగా, ఆయన గుండెపోటుతో మరణించడానికి రెండు గంటల ముందు.. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం గమనార్హం.