మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ఆరోగ్యం స్వల్పంగా మెరుగు

|

Aug 20, 2020 | 1:01 PM

ప్రణబ్ ముఖ‌ర్జీ శరీరంలోని కీలక అవయవాలు చికిత్సకు స్పందిస్తున్నాయ‌ని, ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగుపడిందని వైద్యులు వెల్లడించారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ఆరోగ్యం స్వల్పంగా మెరుగు
Follow us on

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ(84) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ప్రణబ్ ఆర్మీ రిసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆయన ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రణబ్ ముఖ‌ర్జీ శరీరంలోని కీలక అవయవాలు చికిత్సకు స్పందిస్తున్నాయ‌ని, ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగుపడిందని వైద్యులు వెల్లడించారు. ఇప్పటికీ ప్రణబ్ కి వెంటిలేటర్‌ సాయంతో చికిత్సనందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

ప్రణబ్‌ ఆరోగ్యానికి సంబంధించిన కీలక పరీక్షలు నిర్వహించిన వైద్యలు ఆ రిపోర్టులను స్పెషలిస్టుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్టు ఆర్మీ రిసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ హాస్పిటల్‌ వైద్యులు తెలిపారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10న ప్రణబ్‌కు శస్త్రచికిత్స చేశారు. చికిత్స తర్వాత నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీనికి తోడు.. ఆయనకు కరోనా వైరస్ సోకడంతో ప్రణబ్ ఆరోగ్యం క్షిణించింది. మరోవైపు ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.