నిలకడగా మన్మోహన్ సింగ్ ఆరోగ్యం

మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. నిన్న సాయంత్రం హఠాత్తుగా అస్వస్థతకు గురైన ఆయనను వెంటనే ఎయిమ్స్ లో చేర్చారు..

నిలకడగా మన్మోహన్ సింగ్ ఆరోగ్యం

Edited By:

Updated on: May 11, 2020 | 1:33 PM

మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. నిన్న సాయంత్రం హఠాత్తుగా అస్వస్థతకు గురైన ఆయనను వెంటనే ఎయిమ్స్ లో చేర్చారు. ఆయనకు జ్వరం ఉందని, ఇందుకు కారణాలను తెలుసుకుంటున్నామని డాక్టర్లు తెలిపారు. ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో 87 ఏళ్ళ ఈ మాజీ ప్రధానికి చికిత్స అందిస్తున్నారు. 2004-2014 మధ్య ప్రధానిగా కొనసాగిన మన్మోహన్ సింగ్ కి 2009 లో బైపాస్ శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు కోరుతున్నారు.