Tragedy: తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ, రన్నరప్ దుర్మరణం

సోమవారం ఉదయం ఓ ట్రాజెడీ వార్త అందుతోంది. 2019 మిస్ కేరళ విజేత అన్సీ కబీర్, రన్నరప్ అంజనా షాజన్ కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

Tragedy: తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ, రన్నరప్ దుర్మరణం
Ansi Kabeer, Anjana Shajan

Updated on: Nov 01, 2021 | 9:19 AM

సోమవారం ఉదయం ఓ ట్రాజెడీ వార్త అందుతోంది. 2019 మిస్ కేరళ విజేత అన్సీ కబీర్, రన్నరప్ అంజనా షాజన్ కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. సోమవారం ఎర్నాకుళం బైపాస్‌లోని హాలిడే ఇన్ ముందు తెల్లవారుజామున ఒంటి గంటకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్పీడ్‌గా వెళ్తుండగా, మోటారు సైకిల్‌ అడ్డు రావడంతో.. దాన్ని తప్పించబోయి కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. అన్సీ కబీర్.. తిరువనంతపురం అట్టింగల్‌లోని అలంకోడ్‌కు చెందినవారు. అంజనా షాజన్ స్వస్థలం త్రిసూర్. ప్రమాదం జరగ్గానే తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే వీరిద్దరూ మృతిచెందారు. కారులో ప్రయాణిస్తోన్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్షతగాత్రులకు ఎర్నాకులం మెడికల్ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. అన్సీ, అంజనా మృతదేహాలను మార్చురీకి తరలించారు.

Also Read: పవన్ డెడ్‌లైన్‌పై వైసీపీ కౌంటర్.. రివర్స్ పంచ్ వేసిన అంబటి..

చుక్కలనంటుతున్న కూరగాయల ధరలు.. సెంచరీ దాటిన బీరకాయ, చిక్కుడు, పచ్చి మిర్చి