ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు రూ. 1.3 కోట్ల పరిహారం

| Edited By: Pardhasaradhi Peri

Aug 12, 2020 | 4:42 PM

ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ కు కేరళ ప్రభుత్వం నుంచి రూ. 1.3 కోట్ల పరిహారం లభించింది. రెండున్నర దశాబ్దాల క్రితం ఓ గూఢచర్యం కేసులో..

ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు రూ. 1.3 కోట్ల పరిహారం
Follow us on

ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ కు కేరళ ప్రభుత్వం నుంచి రూ. 1.3 కోట్ల పరిహారం లభించింది. రెండున్నర దశాబ్దాల క్రితం ఓ గూఢచర్యం కేసులో ఆయనను కేరళ పోలీసులు ఇరికించారు. అది తప్పుడు కేసని ఆయన వాదించినా వారు వినలేదు. దీంతో నంబి నారాయణన్ సుప్రీంకోర్టుకెక్కారు. ఈ కేసులో ఆయన దోషి కాదని, ఆయనకు రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు  ఆదేశించింది. పైగా మరింత పరిహారం కూడా పొందడానికి ఆయన అర్హుడని, దీనికోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఈ ఉత్తర్వులతో నంబి నారాయణన్ కేరళ ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు ఈ కేసును విచారించింది. సీఎం పినరయి విజయన్ ఆదేశాలపై అప్పటి ప్రభుత్వ కార్యదర్శి జయకుమార్ నంబి నారాయణన్ తో సెటిల్మెంట్ కి వచ్చి..సంబంధిత ఫైలును ప్రభుత్వానికి పంపారు.

చివరకు ఈ మాజీ శాస్త్రవేత్తకు  కేరళ ప్రభుత్వం నుంచి రూ. 1.3 కోట్ల పరిహారం లభించింది.