ప్రధాని మోదీని ఓ మాజీ సీఎం ఎంతమాటన్నారో తెలుసా?

| Edited By:

Oct 03, 2019 | 7:27 PM

ప్రధాని మోదీపై కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య షాకింగ్ కామెంట్ చేశారు. మోదీకి అసలు మానవత్వమే లేదంటూ విమర్శించారు. ఇటీవల విపరీతంగా కురిసిన వర్షాలతో కర్ణాటక అతలాకుతలమైపోతే.. కనీసం సాయం చేయలేదంటూ ఆరోపించారు సిద్ధరామయ్య. బీహార్‌లో వరదలు పోటెత్తితే ప్రధాని ట్వీట్‌లు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ జయంతి సందర్భంగా జరిగిన సద్భావనా పాదయాత్రలో పాల్గొన్న సిద్దూ.. ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు. అమెరికా వెళ్లి ప్రసంగించడానికి మోదీకి సమయం ఉందని, కానీ కర్ణాటకలో వరద […]

ప్రధాని మోదీని   ఓ మాజీ సీఎం ఎంతమాటన్నారో తెలుసా?
Follow us on

ప్రధాని మోదీపై కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య షాకింగ్ కామెంట్ చేశారు. మోదీకి అసలు మానవత్వమే లేదంటూ విమర్శించారు. ఇటీవల విపరీతంగా కురిసిన వర్షాలతో కర్ణాటక అతలాకుతలమైపోతే.. కనీసం సాయం చేయలేదంటూ ఆరోపించారు సిద్ధరామయ్య. బీహార్‌లో వరదలు పోటెత్తితే ప్రధాని ట్వీట్‌లు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ జయంతి సందర్భంగా జరిగిన సద్భావనా పాదయాత్రలో పాల్గొన్న సిద్దూ.. ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు.

అమెరికా వెళ్లి ప్రసంగించడానికి మోదీకి సమయం ఉందని, కానీ కర్ణాటకలో వరద బాధితులను పట్టించుకోడానికి సమయం లేదన్నారు. కుండపోత వర్షాలతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైన జీవించడం కష్టంగా మారిన ప్రజలను కనీసం పట్టించుకునే వారే కరువయ్యారంటూ సిద్ధూ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర సాధన కోసం మహాత్మా గాంధీ ఎంతో కృషి చేశారని, కానీ నేటి పాలకులు సామాన్య ప్రజల కష్టాలను కనీసం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. .. జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. దీంతో రాష్ట్రంలో వరదబాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ సిద్దూ ఆరోపించారు.