బిహార్ లో జేడీ-యు లో చేరిన మాజీ డీజీపీ , ఆర్జేడీ నేత

| Edited By: Pardhasaradhi Peri

Aug 30, 2020 | 10:44 AM

బీహార్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ డీజీపీ సునీల్ కుమార్ , ఆర్జేడీ నేత హర్షవర్ధన్ సింగ్ పాలక జేడీ-యూ లో చేరారు. లోక్ సభలో జేడీ-యు నేత రాజీవ్ రంజన్ సింగ్ వీరిని..

బిహార్ లో జేడీ-యు లో చేరిన మాజీ డీజీపీ , ఆర్జేడీ నేత
Follow us on

బీహార్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ డీజీపీ సునీల్ కుమార్ , ఆర్జేడీ నేత హర్షవర్ధన్ సింగ్ పాలక జేడీ-యూ లో చేరారు. లోక్ సభలో జేడీ-యు నేత రాజీవ్ రంజన్ సింగ్ వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీహార్ అసెంబ్లీలో 243 సీట్లున్నాయి. రానున్న అక్టోబర్-నవంబర్ నెలల్లో శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ కాలపరిమితి నవంబరు 29 తో ముగియబోతోంది. దీంతో ఇప్పటి నుంచే రాష్ట్రంలో రాజకీయ ‘సందడి’ మొదలైంది. ఇక్కడ ఆర్జేడీ, జేడీ-యూ మధ్య పోటాపోటీ పరిస్థితి నెలకొంది. జేడీ-యూ నుంచి ఆర్జేడీ లోకి, ఆర్జేడీ నుంచి జేడీయూ లోకి వలసలు ప్రారంభమవుతున్నాయి. ప్రధానంగా జాతీయ రాజకీయాలను బీహార్ ఎన్నికలు కూడా ప్రభావితం చేయనుండగా.. ఇక అందరి దృష్టీ త్వరలో జరగనున్న ఎన్నికలపై పడింది. అయితే ఎన్నికల కమిషన్ దేశ వ్యాప్తంగా కొని రాష్ట్రాల శాసన సభలకు, కొన్ని  చోట్ల అసెంబ్లీ సెగ్మెంట్లకు జరగనున్న ఉప ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా వైరస్ పాండమిక్ కారణంగా వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మార్గదర్శక సూత్రాలను ఈసీ రూపొందిస్తోంది.