జేడీ-యూలో చేరిన బీహార్ మాజీ డీజీపీ

| Edited By: Pardhasaradhi Peri

Sep 27, 2020 | 7:26 PM

బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఆదివారం జేడీ-యూలో చేరారు. తనను పార్టీ అధినేత, సీఎం నితీష్ కుమార్ పిలిపించి ఈ పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించారని అయన చెప్పారు. నాకు రాజకీయాలు తెలియవు..

జేడీ-యూలో చేరిన బీహార్ మాజీ డీజీపీ
Follow us on

బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఆదివారం జేడీ-యూలో చేరారు. తనను పార్టీ అధినేత, సీఎం నితీష్ కుమార్ పిలిపించి ఈ పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించారని అయన చెప్పారు. నాకు రాజకీయాలు తెలియవు.. చాలా సింపుల్ వ్యక్తిని..సమాజంలోని బడుగు వర్గాలకు సేవ చేయాలన్నదే నా ధ్యేయం అని ఆయన పేర్కొన్నారు. కాగా-వచ్ఛే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గుప్తేశ్వర్ పాండే తన సొంత జిల్లా అయిన బక్సర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చునని భావిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలతో బాటే జరిగే వాల్మీకి నగర్ లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా ఆయనను పార్టీ ఆదేశించవచ్చునని తెలుస్తోంది. కానీ తనకు తన సొంత జిల్లా ప్రజల నుంచే విజ్ఞప్తులు వస్తున్నాయని, అందువల్ల తను శాసన సభ ఎలెక్షన్స్ లో బక్సర్ సెగ్మెంట్ నుంచే పోటీ చేయవచ్చునని గుప్తేశ్వర్ పాండే అంటున్నారు.