AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: పేపర్లపై కాదు.. పథకాల ఫలితాలు ప్రజల్లో కనిపించాలి: ప్రధాని మోదీ

ఢిల్లీలోని సేవాతీర్థంలో భారత ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాన మోదీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేశ ప్రగతి, పరిపాలనా సంస్కరణలే లక్ష్యంగా సాగిన ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలు, భవిష్యత్తు వ్యూహాలపై ప్రధాని అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు.

PM Modi: పేపర్లపై కాదు.. పథకాల ఫలితాలు ప్రజల్లో కనిపించాలి: ప్రధాని మోదీ
Government Secretaries Meeting
Anand T
|

Updated on: Jun 30, 2026 | 9:39 PM

Share

ఢిల్లీలోని సేవాతీర్థంలో భారత ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని మోదీ కీలక సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలు, భవిష్యత్తు కార్యచరణపై అధికారులకు ముఖ్యం రెండు కీలక అంశాలపై దిశానిర్ధేశం చేశారు. ప్రస్తుతం దేశంలో అమలవుతున్న నిబంధనల సరళీకరించి.. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడంతో పాటు వ్యాపార అనుకూల వాతావరణాన్ని మరింత మెరుగుపర్చాలన్నారు. అలాగే దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ, స్వయంసమృద్ధి సాధన దిశగా అడుగులు వేయాలన్నారు..

ఇదిగా ఉండగా ప్రధాని దార్శనికతను క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక ఫలితాలుగా మార్చేందుకు తాము తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీకి వివరించారు కార్యదర్శులు. ఆయా రంగాలలో ఎదురవుతున్న సవాళ్లను ప్రస్తావిస్తూనే, పరిపాలనను, సేవల వితరణను మరింత పటిష్ఠం చేయడానికి తాము సిద్ధం చేసుకున్న భవిష్యత్తు వ్యూహాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వివిధ ప్రభుత్వ విభాగాలు విడివిడిగా కాకుండా, ప్రభుత్వమంతా ఒకే వ్యవస్థగా పని చేసే విధానాన్ని అవలంబించాలని స్పష్టం చేశారు. శాఖల మధ్య ఉన్న అడ్డంకులను పూర్తిగా తొలగిపోవాలన్నారు. సమగ్ర ప్రణాళిక, అంతర-శాఖల సమన్వయం, సరైన నిర్ణయాలు వేగంగా తీసుకోవడానికి పీఎం గతిశక్తి ఒక సమర్థవంతమైన వేదిక అని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, ప్రజల జీవితాలపై చూపే వాస్తవిక మరియు ప్రత్యక్ష ప్రభావం పైనే అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us