Road Accident: దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా దూసుకొచ్చిన మృత్యువు.. ఐదుగురు తెలుగు విద్యార్థులు మృతి

|

Aug 12, 2024 | 7:30 AM

ఒకే కాలేజీలో చదువుతున్న ఏడుగురు స్నేహితులు రెండ్రోజులు సెలవులు రావడంతో కారులో ఆలయానికి వెళ్లి తిరిగొస్తున్నారు. ఇంతలో ఊహించని ప్రమాదం వారి ప్రాణాలను కబలించింది. వీరు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొట్టడంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన తమిళనాడులో..

Road Accident: దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా దూసుకొచ్చిన మృత్యువు.. ఐదుగురు తెలుగు విద్యార్థులు మృతి
Road Accident In Tamil Nadu
Follow us on

చెన్నై, ఆగస్టు 12: ఒకే కాలేజీలో చదువుతున్న ఏడుగురు స్నేహితులు రెండ్రోజులు సెలవులు రావడంతో కారులో ఆలయానికి వెళ్లి తిరిగొస్తున్నారు. ఇంతలో ఊహించని ప్రమాదం వారి ప్రాణాలను కబలించింది. వీరు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొట్టడంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన తమిళనాడులో ఆదివారం (ఆగస్టు 11) చోటు చేసుకొంది. వివరాల్లోకెళ్తే..

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని రామంచేరి ప్రాంతంలో ఆదివారం వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు విద్యార్ధులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను ప్రొద్దుటూరుకు చెందిన గిద్దలూరు నితీష్‌ (21), తిరుపతికి చెందిన యుగేశ్‌ (23), చేతన్‌ (22), కర్నూలుకు చెందిన రామ్మోహన్‌ (21), విజయవాడకు చెందిన బన్ను నితీష్‌ (22), నెల్లూరుకు చెందిన విష్ణు, ప్రకాశం జిల్లాకు చెందిన చైతన్యగా గుర్తించారు. వీరంతా స్నేహితులు. చెన్నై సమీపంలోని ఎస్‌ఆర్‌ఎం కళాశాలలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నారు.

వారందరూ శనివారం, ఆదివారం సెలవు కావడంతో కారులో తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్లారు. స్వామివారి దర్శనానంతరం తిరిగి ఆదివారం రాత్రి చెన్నై బయల్దేరారు. తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన ట్రక్కు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీ కొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విష్ణు, చైతన్యలను స్థానికులు తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తీవ్రతకు కారులోనే మృతదేహాలన్నీ చిక్కుకుపోయాయి. దీంతో పోలీసులు అతికష్టం మీద బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. ప్రమాదంపై కేకే చత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.