అబూదాబిలో నిర్మించే హిందూ ఆలయ ఆకృతి మహాద్భుతం

|

Nov 11, 2020 | 10:59 AM

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని అబూదాబిలో నిర్మిస్తున్న హిందూ దేవాలయ ఆకృతులను ఆలయ నిర్వాహకులు విడుదల చేశారు..

అబూదాబిలో నిర్మించే హిందూ ఆలయ ఆకృతి మహాద్భుతం
Follow us on

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని అబూదాబిలో నిర్మిస్తున్న హిందూ దేవాలయ ఆకృతులను ఆలయ నిర్వాహకులు విడుదల చేశారు.. బీఏపీఎస్‌ హిందూ మందిర్‌ కమిటీ వీడియో రూపంలో విడుదల చేసిన ఆలయ నమూనా అందరినీ ఆకట్టుకుంటోంది.. అబూ మురీఖా ప్రాంతంలో పూర్తిగా రాతితో నిర్మిస్తున్న ఆ ఆలయం శంకుస్థాపన గత ఏడాది ఏప్రిల్‌లో జరిగింది.. పోయిన ఏడాది డిసెంబర్‌ నుంచి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. ఇప్పుడు విడుదల చేసిన ఆలయ నమూనా వీడియోలో రాతి స్తంభాలపై హిందూ పురాణ కథల చిత్రాలు అలరిస్తున్నాయి. భారత ఇతిహాసాలతో ఆలయ గోడలు అలరారబోతున్నాయని నిర్వాహకులు చెప్పారు. ఆలయ ప్రాంగణంలో గ్రంథాలయం, పాఠశాల, సమావేశమందిరం, సాంస్కృతిక మందిరం కూడా ఉన్నాయి.. ప్రపంచశాంతి, సామరస్యాల కోసం ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఎడారి దేశాలలో ఇది ఓ అధ్యాత్మిక ఒయాసిస్సు కాబోతున్నదని ఆలయ నిర్వాహకులు అంటున్నారు.