కేరళలో సార్స్-కొవ్-2 జీన్ స్టడీ, సీక్వెన్స్ లో మారని ‘సీన్’ !

ఈ కరోనా వైరస్ సీజన్ లో సార్స్-కొవ్-2 వైరస్ జీన్ పై కేరళలో నిర్వహించిన పరిశోధనలు ఆశాజనకమైన ఫలితాలనేమీ ఇవ్వలేదు. కొంతమంది కరోనా రోగుల శాంపిల్స్ నుంచి ఐసొలేట్ చేసిన ఈ వైరస్ ద్వారా కొత్త విషయాలేవీ తెలియలేదని రీసెర్చర్లు వెల్లడించారు.

కేరళలో సార్స్-కొవ్-2 జీన్ స్టడీ, సీక్వెన్స్ లో మారని 'సీన్' !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 19, 2020 | 1:17 PM

ఈ కరోనా వైరస్ సీజన్ లో సార్స్-కొవ్-2 వైరస్ జీన్ పై కేరళలో నిర్వహించిన పరిశోధనలు ఆశాజనకమైన ఫలితాలనేమీ ఇవ్వలేదు. కొంతమంది కరోనా రోగుల శాంపిల్స్ నుంచి ఐసొలేట్ చేసిన ఈ వైరస్ ద్వారా కొత్త విషయాలేవీ తెలియలేదని రీసెర్చర్లు వెల్లడించారు. పైగా కాస్త డిస్టర్బింగ్ గానే ఉన్నాయని వారన్నారు. కౌన్సిల్ ఆఫ్ సైన్టిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యాన ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ జీనోమిక్స్, అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ, మరో సంస్థ-కోజికోడ్ మెడికల్ కాలేజీ సాయంతో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. రోగుల నుంచి తాము మొత్తం 200 శాంపిల్స్ ను సీక్వెన్స్ చేసినప్పటికీ వీటిలో నూట పదమూడింటిపై మాత్రమే అధ్యయనం చేయగలిగామని ఈ కాలేజ్ హెడ్ డాక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. తమ కాలేజ్ నుంచి ఐసొలేట్ చేసిన అన్నిశాంపిల్స్ సార్స్-కొవ్-2  వైరస్ సబ్ టైప్ కిందే ఉన్నాయని, యూరప్, అమెరికా దేశాల్లోని షాట్స్ తరహాలోనే ఇవి కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఈ వైరస్ కేరళలో కూడా వ్యాపించిందని ఈ జీన్ స్టడీ ద్వారా తెలుసుకోగలిగామన్నారు.

మొత్తానికి తమ స్టడీ పెద్ద ఫలితాలను ఇవ్వలేదని ఆయన అభిప్రాయపడ్డారు.