Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. చివరికి

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైల్లో ఉన్న ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. మంటలను గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. చివరికి
Vande Bharat Train

Updated on: Jul 17, 2023 | 12:35 PM

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైల్లో ఉన్న ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. మంటలను గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాణి కమలాపతి – హజ్రత్ నిజాముద్దీన్ అనే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సోమవారం తెల్లవారుజామున భోపాల్‌కు బయలుదేరింది. అయితే ఉదయం 6.45 AM గంటలకు సీ-12 బోగీ చక్రాల నుంచి పొగలు రావడాన్ని రైల్వే సిబ్బంది గమనించారు. దీంతో రైలును విదిశ జిల్లాలోని నిలిపివేసి తనిఖీ చేశారు.

ఈ తనిఖీల్లో బ్యాటరీ బాక్సుల్లో నుంచి మంటలు వచ్చినట్లు గుర్తించారు. అయితే మంటలు మాత్రం బ్యాటరీ బాక్స్‌లోనే వచ్చాయని.. వాటిని అదుపు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ రైలుకు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారని తెలిపారు. మళ్లీ అన్ని తనిఖీలు పూర్తయ్యాక రైలు ఢిల్లీకి వెళ్తుందని పేర్కొన్నారు. అయితే మంటలు వచ్చినప్పుడు సీ-12 బోగీలో దాదాపు 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లో అందుబాటులోకి తెచ్చిన మొట్టమొదటి వందేభారత్ రైలు కూడా ఇదే. దీన్ని ప్రధాని మోదీ ఏప్రిల్ 1న ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us