బ్రేకింగ్‌.. దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం..

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నార్త్‌ వెస్ట్‌ ఢిల్లీలోని స్వరూప్‌ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక కెమికల్ గోడౌన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

బ్రేకింగ్‌.. దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం..

Edited By:

Updated on: Jun 11, 2020 | 10:39 PM

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నార్త్‌ వెస్ట్‌ ఢిల్లీలోని స్వరూప్‌ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక కెమికల్ గోడౌన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి మంటలను అదుపు చేసేందుకు 9 అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించారు.

ఢిల్లీ ఫైర్ సర్వీస్‌ డైరక్టర్‌ అతుల్ గర్గ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 7.42 తమకు సమాచారం అందిందని.. వెంటనే తాము ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించామని తెలిపారు. అయితే ఈ ఘటనకు కారణం ఇంకా తెలియరాలేదని.. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, గతంలో కూడా ఢిల్లీలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి.