సర్కార్‌పై కోపం తెచ్చుకున్న డాక్యుమెంటరీ డైరెక్టర్‌

|

Oct 06, 2020 | 12:29 PM

తన అనుమతి తీసుకోకుండా, తన ప్రమేయం లేకుండా, తనకు చెప్పకుండా తను తీసిన డాక్యుమెంటరీని నిడివి తగ్గించేసి, అర్థం పర్థం లేకుండా చేసి ఎవరైనా ప్రసారం చేస్తే కోపం వచ్చేయదూ! అలాంటి కోపమే ఉచూ ఆగస్టిన్‌కు వచ్చింది..

సర్కార్‌పై కోపం తెచ్చుకున్న డాక్యుమెంటరీ డైరెక్టర్‌
Follow us on

తన అనుమతి తీసుకోకుండా, తన ప్రమేయం లేకుండా, తనకు చెప్పకుండా తను తీసిన డాక్యుమెంటరీని నిడివి తగ్గించేసి, అర్థం పర్థం లేకుండా చేసి ఎవరైనా ప్రసారం చేస్తే కోపం వచ్చేయదూ! అలాంటి కోపమే ఉచూ ఆగస్టిన్‌కు వచ్చింది.. ఈమె ఇండోనేషియాకు చెందిన డాక్యుమెంటరీ డైరెక్టర్‌.. అంధులైన ఇద్దరు ఫ్రెండ్స్‌ జీవితం ఆధారంగా ఆమె ఓ డాక్యుమెంటరీ తీశారు.. ఆ షార్ట్‌ఫిల్మ్‌ను ఏ మాధ్యమంలోనూ అప్‌లోడ్‌ చేయలేదు.. కానీ ఇండోనేషియా ప్రభుత్వానికి చెందిన టీవీఆర్‌ఐ అనే ఛానెల్‌ ఆ డాక్యుమెంటరీని గత జూన్‌లో ప్రసారం చేసింది. చదువు ఆవశ్యకతను చెప్పేందుకు ఈ షార్ట్‌ఫిల్మ్‌ను ప్రసారం చేశారు బాగానే ఉంది.. కానీ ఈ దర్శకురాలి అనుమతి తీసుకోవాలిగా…! అది చేయలేదు.. విద్యాశాఖ సూచించిందని చెప్పి టీవీఆర్‌ఐ ఛానెల్‌ ప్రసారం చేసేసింది.. ఆ తర్వాత మరో రెండు టీవీ ఛానెళ్లు కూడా అదే పని చేశాయి.. దీంతో ఆగస్టిన్‌కు కోపం నషాళానికి అంటింది.. తన అనుమతి లేకుండా తన డాక్యుమెంటరీని ప్రసారం చేసిన టీవీఆర్‌ఐ ఛానెల్‌కు, విద్యాశాఖకు, మరో రెండు టీవీ ఛానెళ్లకు ఆగస్టిన్‌ నోటీసులు పంపించింది. అమె తీసిన డాక్యుమెంటరీ నిడివి 34 నిమిషాల 26 సెకన్లు ఉంటే.. దాన్ని ఎడిట్‌ చేసి 22 నిమిషాల 58 సెకన్లకు కుదించారట.. అలా చేయడం వల్ల కథ పూర్తిగా దెబ్బతిన్నదట! ఇది కూడా ఆగస్టిన్‌కు కోపం తెప్పించింది.. పైగా డాక్యుమెంటరీ అనువాదంలో కూడా బోలెడన్నీ తప్పులున్నాయట.. ఇలా నోటీసులు ఇచ్చేసరికి విద్యాశాఖ కాస్త తగ్గి అగస్టిన్‌తో చర్చలు మొదలుపెట్టింది..