100 దేశాలు ఏకం.. వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఉత్సవాల్లో ఫిజీ ప్రెసిడెంట్.. సేవలపై ప్రశంసలు..

వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఫెస్టివల్‌కు ఫిజీ ప్రెసిడెంట్ హాజరయ్యారు. ఈ వేడుక భారత్-ఫిజీ బలమైన బంధాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటింది. సద్గురు శ్రీ మధుసూదన్ సాయి మిషన్‌ను ప్రశంసిస్తూ.. సత్య సాయిగ్రామంలో అందిస్తున్న ఉచిత ఆరోగ్య సేవలు, మానవతా కార్యక్రమాలను కొనియాడారు. ప్రపంచ ఐక్యత, సేవా మార్గానికి ఫిజీ మద్దతు ప్రకటించింది.

100 దేశాలు ఏకం.. వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఉత్సవాల్లో ఫిజీ ప్రెసిడెంట్.. సేవలపై ప్రశంసలు..
One World One Family Festival 2025

Updated on: Nov 18, 2025 | 5:14 PM

వంద దేశాల సంస్కృతులను ఏకతాటిపైకి తెస్తున్న ‘వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ 2025లో భాగంగా 93వ రోజు వేడుకలకు ఫిజీ రిపబ్లిక్ ప్రెసిడెంట్ రతు నైకామా తవాకేకొలాటీ లాలాబలవు, ప్రథమ మహిళ ఎమిలీ లాలాబలవు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఫిజీతో పాటు దక్షిణ పసిఫిక్‌కు చెందిన ఏడు ద్వీప దేశాల సంస్కృతి, గౌరవం, సోదరభావాన్ని ప్రతిబింబిస్తూ కార్యక్రమాలు జరిగాయి. ఈ మహోత్సవం భారత్-ఫిజీల మధ్య ఉన్న బలమైన, శాశ్వత స్నేహ బంధానికి అద్దం పట్టింది.

ప్రపంచానికి ప్రేమ, సేవా మార్గం

వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ అనే విశ్వ వాక్యాన్ని ప్రతిబింబిస్తూ 100 దేశాలు ఒకే వేదికపై ఏకం కావడం, ఏకత్వం, ఐక్యత, విశ్వాసం, మానవతా విలువలను ప్రపంచానికి అందించడం ఈ ఉత్సవం యొక్క ప్రధాన సందేశం. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ రతు నైకామా తవాకేకొలాటీ లాలాబలవు ప్రసంగిస్తూ.. సత్య సాయిగ్రామంలో కనిపిస్తున్న ఈ ప్రేమ, సేవామార్గం నేడు ప్రపంచం అత్యవసరంగా కోరుకునే స్ఫూర్తిదాయక దృక్పథమని అన్నారు.

సత్య సాయి గ్రామం సేవలకు ప్రశంసలు

ఫిజీలోని సాయి ప్రేమ ఫౌండేషన్, శ్రీ సత్య సాయి సంజీవని చిల్డ్రన్స్ హాస్పిటల్‌ ద్వారా డా. కృపాలి టప్పూ, సుమీత్ టప్పూ కుటుంబం ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రశంసించారు. 2016 నుండి ఇప్పటివరకు 421 మంది పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు, 4.59 మిలియన్ల ఉచిత భోజనాల పంపిణీ, 1.5 లక్షలకు పైగా ప్రజలకు ఉచిత గుండె పరీక్షలు, వైద్య సేవలను అందించడం వంటి మహత్తర కార్యక్రమాలు ఎందరో జీవితాలను మార్చాయని ప్రెసిడెంట్ అభినందించారు.

ఆరోగ్య సేవలు వ్యాపారం కాదు

ముద్దెనహళ్లిలోని సత్య సాయిగ్రామం ఉచితంగా అందిస్తున్న ప్రపంచస్థాయి వైద్య సేవలు, మానవాళికి అందించే అత్యున్నత సేవల్లో ఒకటని రతు నైకమా అన్నారు. ఆరోగ్య సేవలు వ్యాపారం కాకుండా చూడటం అత్యంత ముఖ్యమని అన్నారు. లక్షలాది జీవితాలను ఉద్ధరించగల సామర్థ్యం ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ మోడల్ ఒక ఆదర్శ నమూనా అని ప్రెసిడెంట్ ప్రశంసించారు.

సద్గురు శ్రీ మధుసూదన్ సాయికి ఫిజీ మద్దతు

సద్గురు శ్రీ మధుసూదన్ సాయి చేపడుతున్న వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్‌కు ఏ మద్దతు అవసరమైనా, ఫిజీ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రెసిడెంట్ రతు నైకమా హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమం కోసం ఫిజీ, ఈ మిషన్ భాగస్వామ్యం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కాగా ఈ ఏడాది ప్రారంభంలోనే మిషన్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన్ సాయి ఫిజీ దేశపు అత్యున్నత పౌర పురస్కారం అయిన కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీను అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న మూడో భారతీయుడిగా సద్గురు నిలిచారు. సమిష్టి సేవ ద్వారా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ అనేది కేవలం నినాదం కాదని, సాకారమవుతున్న సజీవ సత్యమని ద్గురు శ్రీ మధుసూదన సాయి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమాలలో సాంప్రదాయ ఐటౌకీ స్వాగత వందనం, ఫిజీకి చెందిన ప్రిమనావియా గ్రూప్ అందించిన సాంస్కృతిక నృత్య గీతాలు భారత్-ఫిజీల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేశాయి. ఫిజీ ప్రెసిడెంట్ నవంబర్ 23 వరకు సత్య సాయి గ్రామంలోనే ఉండనున్నారు. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.