కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకోవాలి.. లేకుంటే రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డును వెనక్కిచ్చేస్తా..

అన్నదాతల ఆగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ధర్నా శుక్రవారానికి 23వ రోజుకు చేరింది.

కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకోవాలి.. లేకుంటే రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డును వెనక్కిచ్చేస్తా..

Updated on: Dec 18, 2020 | 7:38 PM

అన్నదాతల ఆగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ధర్నా శుక్రవారానికి 23వ రోజుకు చేరింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు సైతం రైతులకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా బాక్సర్ , కాంగ్రెస్ నేత విజేందర్ సింగ్ మద్దతు తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులకు  విజేందర్ సింగ్ ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతులు చేస్తున్న ఈ పోరాటం ప్రభుత్వానికో పార్టీకో వ్యతిరేకం కాదు. ఈ పోరాటం ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరకంగా చేస్తున్నారని అన్నారు. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని, లేకుంటే తన రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డును వెనుక్కు ఇచ్చేస్తానని విజేందర్ సింగ్  ప్రకటించారు.