Army vs Police: జవాన్లు దేశానికి రక్షణ కవచంగా ఉంటారు. పోలీసులు దేశంలోని అంతర్గత శాంతిభద్రతలు పర్యవేక్షిస్తారు. అయితే శుక్రవారం ఉత్తరాఖండ్(Uttarakhand).. హరిద్వార్‌లోని డెహ్రడూన్ నేషనల్ హేవే(Dehradun national highway)పై పోలీసులు, ఆర్మీ జవాన్ల మధ్య ఫైట్ జరిగింది. నడిరోడ్డుపైనే దాదాపు గంటకుపైగా హైఓల్టేజ్ డ్రామా నడిచింది. సరకులతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు.. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు కారును ఢీకొట్టడంతో అగ్గి రాజుకుంది. ఎస్ఐ.. ఆర్మీ సిబ్బందిని ట్రక్కుతో సహా పోలీస్‌స్టేషన్‌కు రమ్మని చెప్పడం వివాదం ముదిరింది. జవాన్లు, పోలీసులు మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం జరిగింది. ఓ సమయంలో తోపులాటకు దారితీసింది. స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. జవాన్లకు మద్దతుగా ‘ఆర్మీ జిందాబాద్’, ‘భారత్ మాతాకు జై’ అంటూ నినాదాలు చేశారు. ఇంకొందరు పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి జనం ఆర్మీ వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పామని, ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటారని ఎస్ఐ వెల్లడించారు. ఈ వివాదంతో రోడ్‌పై చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. జవాన్లు, పోలీసుల మధ్య ఫైట్ స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.