Vijay thalapathy: వివాదంలో టీవీకే పార్టీ చీఫ్… నటుడు విజయ్‌కు ఫత్వా జారీ!

తమిళనాడులో ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఏడాదిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం రాజకీయాల పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీవీకే అధినేత, నటుడు విజయ్ వివాదంలో చిక్కుకున్నారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన ఇచ్చిన ఇఫ్తార్ విందుపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ ఫత్వా జారీ చేశారు.

Vijay thalapathy: వివాదంలో టీవీకే పార్టీ చీఫ్... నటుడు విజయ్‌కు ఫత్వా జారీ!
Fatwa Issued Against Actor

Updated on: Apr 17, 2025 | 12:31 PM

టీవీకే స్థాపకుడు, నటుడు దళపతి విజయ్ పై ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసింది. మద్యం సేవించేవారిని, జూదగాళ్లను ఇఫ్తార్ విందుకు పిలిచి చట్టవిరుద్దంగా ప్రవర్తించారని..దీనితో పాటు రంజాన్‌ పవిత్రతను దెబ్బతీసేలా చేశారని ఫత్వాలో AIMJ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ పేర్కొన్నారు. విజయ్ నటించిన చిత్రాల్లో ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరించారని..ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టినందున..ఓట్ల కోసం ముస్లింలను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తున్నారని రజ్వీ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇఫ్తార్ విందుకు జూదగాళ్లను ఆహ్వానించడంతో తమిళనాడులోని సున్నీ ముస్లింలు అతనిపై కోపంగా ఉన్నారని ఆయన తెలిపారు. వారి కోరిక మేరకే ఫత్వా జారీ చేశానని ఆయన అన్నారు.

నటుడు విజయ్ మార్చి 8న చెన్నైలోని వైఎంసిఎ మైదానంలో ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఆయన తలకు టోపీ ధరించి, వారితో కలిసి ఉపవాసం విరమించారు. అయితే విజయ్ ఇఫ్తార్ విందును సరిగ్గా నిర్వహించలేదని, ఇఫ్తార్‌తో సంబంధం లేని వ్యక్తులు అక్కడికి పిలిచి ముస్లింలను అవమానించారని సున్నత్ జమాత్ కోశాధికారి సయ్యద్ కౌస్ అన్నారు. మళ్లీ ఇలాంటివి జరగకుండా చూడాలని విజయ్‌పై చెన్నై పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..