Farmers Protest: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన టాక్టర్ ర్యాలీపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పందించారు. గణతంత్ర దినోత్సవం రోజున ఈ ర్యాలీ చేపట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. రిపబ్లిక్ డే రోజు ర్యాలీ నిర్వహించడంపై రైతులు పునరాలోచన చేస్తే బాగుండేదని అబిప్రాయపడ్డారు. సోమవారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తోమర్ మీడియాతో మాట్లాడారు. జనవరి 26వ తేదీ భారతీయులందరికీ ఎంతో ముఖ్యమైన రోజని, గణతంత్ర దినోత్సవరం రోజున నిరసనలు, ధర్నాలు చేపట్టడం ఏమాత్రం సరికాదని మంత్రి పేర్కొన్నారు. రైతులు 26వ తేదీన కాకుండా మరో తేదీలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తే బాగుండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయితే, రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీని తాము ఆపబోమని స్పష్టం చేశారు. రైతులు చేపట్టే ర్యాలీ ప్రశాంతంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనల్లో భాగంగా రైతులు గణతంత్ర దినోత్సవం రోజైన జనవరి 26న భారీ స్థాయిలో టాక్టర్ ర్యాలీ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఆ మేరకు ఇప్పటికే పిలుపునిచ్చారు కూడా. రైతు సంఘాల పిలుపుతో ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో ఢిల్లీకి బయలు దేరారు. ఇదిలాఉంటే, ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు.. ఢిల్లీ పోలీసులు సైతం అనుమతించారు.
Also read:
గొడవలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి.. పాలన గాడి తప్పితే రాష్ట్రపతి పాలన విధించాలన్న బుద్దా వెంకన్న