Rail Roko by farmers :రైతు చట్టాలను రద్దు చేయాలనీ కోరుతూ అన్నదాతలు గురువారం దేశవ్యాప్తంగా రైల్ రోకో ఆందోళన చేపడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలనుంచి సాయంత్రం 4 గంటలవరకు ఈ ఆందోళన నిర్వహిస్తామని కిసాన్ ఆందోళన్ కమిటీ అధికార ప్రతినిధి జగ తార్ సింగ్ బాజ్వా తెలిపారు. అయితే శాంతియుతంగా ఈ ప్రొటెస్ట్ జరుపుతామని, రైలు ప్రయాణికులకు తినుబండారాలను అందిస్తామని ఆయన చెప్పారు. వీరికి, రైళ్లకు పూలమాలలతో స్వాగతం చెబుతామన్నారు. అలాగే సోషల్ మీడియాలో రైతులను యాక్టివ్ గా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వారి ప్రొఫైల్స్ సేకరిస్తున్నామని ఆయన చెప్పాడు. కాగా రైల్ రోకో ఆందోళన సందర్భంగా రైల్వే శాఖ అదనంగా 20 కంపెనీల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బలగాలను నియమించింది.
రానున్న రోజుల్లో తమ ఆందోళనను పశ్చిమ బెంగాల్ కు కూడా విస్తరిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ తెలిపారు. ఆ రాష్ట్రంలో అన్నదాతలకు వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆయన చెప్పారు. మొత్తానికి మా ప్రొటెస్ట్ ని దేశవ్యాప్తం చేయడమే మా లక్ష్యం అన్నారు.
Also Read:
మమతను ఢీ కొనేందుకు సినీ, టీవీ యాక్టర్లను చేర్చుకుంటున్న బీజేపీ, ఎన్నికల ముందు భలే ఎత్తుగడ
Snake in Scooty: మహిళ స్కూటీలో నక్కిన త్రాచుపాము.. దారిలో వెళ్తుండగా చేతికి మెత్తగా తగలడంతో..