కాళేశ్వరం ప్రాజెక్టు బాధిత రైతులు పట్టువీడడం లేదు. మేడిగడ్డ బ్యాక్ వాటర్‌తో ముంపుకు గురవుతున్న భూములకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నిరసనలు చేపట్టిన రైతులు తమ గోడు పట్టించుకోవాలని మహారాష్ట్ర సర్కార్‌ను కోరారు. మేడిగడ్డ బ్యారేజ్ బ్యాక్ వాటర్‌తో తమ భూములు ముంపునకు గురవుతున్నాయని..పరిహారం ఇవ్వాలంటూ కొందరు రైతులు నిరసనలు చేపట్టారు. 36 రోజులుగా సిరొంచలో నిరసన దీక్షలు కొనసాగిస్తారు. నాగ్‌పూర్ అసెంబ్లీలో శీతాకాల సమావేశాల నేపథ్యంలో.. అక్కడ కూడా నిరసన వ్యక్తం చేశారు. రైతుల నిరసనకు మొదట ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు, దీంతో రోజుకు నలుగురు రైతుల చొప్పున దీక్ష చేపట్టారు. వరుసగా రైతులు దీక్షకు కూర్చొవడంతో స్పందించిన అహేరి ఎమ్మెల్యే ధర్మరావు బాబు.. ప్రభుత్వంతో మాట్లాతానని హామీ ఇచ్చారు.
ఆతర్వాత డిప్యూటీ సీఎం దేవేంద్ర పఢ్నవీస్‌తో రైతులను సమావేశపరిచారు. సిరొంచ తాలూకా రైతులు సమస్యలు విన్న ఫడ్నవీస్…సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పటికే నోటిఫై అయిన 130 హెక్టార్ల భూమికి పరిహారం వెంటనే ఇప్పించడంతో పాటు అదనంగా ముంపునకు గురువుతున్న భూముల గురించి ప్రత్యేకంగా సర్వే చేయిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సిరొంచలో మేడిగడ్డ బాధిత గ్రామాల రైతులతో సమావేశం అయి జరిగిన విషయాన్ని వివరిస్తామని రైతులు తెలిపారు. తమ సమస్యల పట్ల మహారాష్ట్ర సర్కార్ సానుకూలంగా స్పందించడంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..