
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఇండియా కంపెనీ ఆదాయం ఇండియాలో భారీగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో రూ.1.277 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కాగా అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2018-19)లో సంపాదించిన ఆదాయం రూ.893కోట్లతో పోల్చితే 43 శాతం రెట్టింపు సాధించామని ఫేస్బుక్ ఇండియా తెలిపింది. అటు నికర లాభం రూ.65 కోట్ల నుంచి రెట్టింపైన (107 శాతం వృద్ధితో) రూ.136 కోట్లకు పెరిగిందని పేర్కొంది. భారత కార్యకలాపాల కోసం ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిస్తామని ఫేస్బుక్ తెలిపింది. చిన్న, పెద్ద వ్యాపారాలు ఆర్థిక రికవరీ సాధించడంలో ఇతోధికంగా తోడ్పాటునందిస్తామని పేర్కొంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్ స్ట్రాగామ్, వాట్సాప్లను 250 కోట్లమంది ఉపయోగిస్తున్నారు. కోటి మంది యాక్టివ్ అడ్వైర్టైజర్లు ఉన్నారు.