ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే దేశద్రోహమవుతుందా ? సుప్రీంకోర్టు, ‘పిల్’ కొట్టివేత

| Edited By: Anil kumar poka

Mar 03, 2021 | 5:06 PM

ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినంత మాత్రాన అది దేశద్రోహం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకరి అభిప్రాయాలను దేశద్రోహంగా పరిగణించలేమని పేర్కొంది....

ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే దేశద్రోహమవుతుందా ? సుప్రీంకోర్టు, పిల్ కొట్టివేత
Follow us on

ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినంత మాత్రాన అది దేశద్రోహం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకరి అభిప్రాయాలను దేశద్రోహంగా పరిగణించలేమని పేర్కొంది. ఈ విషయంలో జమ్మూ కాశ్మీర్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లాపై దాఖలైన ఓ పిల్ ను కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉన్న వ్యాఖ్యలు వేరు, ఒకరి ఉద్దేశాలు వేరైనప్పటికీ దాన్ని ఇలా వ్యాఖానించజాలమని కోర్టు పేర్కొంది.  జమ్మూ కాశ్మీర్ కు స్వయం నిర్ణయాధికారాన్ని కల్పించే 370 అధికరణాన్నీ కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో దీని పునరుధ్ధరణకు తాను పాకిస్తాన్, చైనా దేశాల సాయం కోరుతానని ఫరూక్ అబ్దుల్లా లోగడ వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడడం ద్వారా ఆయన దేశద్రోహానికి పాల్పడ్డారని ఈ పిల్ ను దాఖలు చేసిన రజత్ శర్మ, ఎన్ .శ్రీవాస్తవ అనే పిటిషనర్లు పేర్కొన్నారు. ఫరూక్ అబ్దుల్లా దేశ వ్యతిరేకి అని, ఆయనను ఎంపీగా కొనసాగనిస్తే ఇండియాలో ఎవరినైనా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు అనుమతించినట్టే అవుతుందని వారన్నారు.ఇది దేశ సమైక్యతకే ప్రమాదకరమన్నారు.

అయితే ఈ వాదన అర్థ రహితమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇది దేశ ద్రోహం కిందికి ఎలా వస్తుందని ప్రశ్నిస్తూ పిటిషనర్లకు 50 వేల రూపాయల జరిమానా విధించింది. కాగా ఫరూక్ అబ్దుల్లా, అయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ తో సహా అనేకమందిని ప్రభుత్వం ఏడాదికి పైగా నిర్బంధించింది. ఇటీవలే వారిని విడుదల చేసింది.  జమ్మూ కాశ్మీర్ కి 370 ఆర్టికల్ పునరుధ్దరణ కోసం తాము మళ్ళీ కేంద్రంతో పోరాడుతామని వీరు అంటున్నారు. ఈ సందర్భంగా ఫరూక్ అబ్దుల్లా అవసరమైతే తాను పాకిస్తాన్ లేదా చైనా సాయమైనా తీసుకుంటానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఇందుకు సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయా అన్న విషయాన్ని కూడా ఆయన ఆలోచిం

 

మరిన్ని ఇక్కడ చదవండి:

hollywood actor will smith : పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తా అంటున్న హాలీవుడ్ స్టార్.. ఎందుకో కారణాలు తెలియజేసిన కండల వీరుడు..

Kidnap case in Tirupati: వీడని మిస్టరీ… తిరుపతిలో కిడ్నాప్ కేసు మిస్టరీ కొనసాగుతూనే ఉన్నది…