లోక్ జనశక్తి పార్టీకి తననే నేతగా ప్రకటించుకున్న చిరాగ్ పాశ్వాన్..రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ పై నిప్పులు చెరిగారు. నితీష్ దళితుల వ్యతిరేకి అని, 2015 లో మాజీ సీఎం, దళిత నాయకుడైన జితన్ రామ్ మంజీ చేత బలవంతంగా రాజీనామా చేయించారని ఆయన ఆరోపించారు. పాశ్వాన్ వర్గాన్ని చీల్చడం ద్వారా నితీష్ కుమార్ తమ పార్టీలో కూడా చీలికలు తేవడానికి యత్నిస్తున్నారని అన్నారు. 2005 ఫిబ్రవరి నుంచే ఆయన ఎల్ జె పీని చీల్చడానికి వరుసగా ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు.. 2006 లో మహా దళిత్ అనే సబ్ గ్రూపును ఏర్పాటు చేసి పాశ్వాన్ వర్గాన్ని, జాటవ్ వర్గాన్ని ఐసొలేట్ చేయడం ద్వారా తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అన్ని కుటిల ప్రయత్నాలూ చేశారు అని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. ఇది ఆయన మైండ్ సెట్ ని ప్రతిబించిందని చెప్పారు. అసలు తన సొంత పార్టీలోనే నితీష్ దళితుల పట్ల ఎలా వ్యవహరించారో అందరికీ తెలిసిందేనని, జితన్ రామ్ మంజీని అధికారం నుంచి కూలదోసిన ‘ఘనత’ ఆయనదేనని చిరాగ్ మండిపడ్డారు.
తాను త్వరలో నిర్వహించే రోడ్ షో లో నితీష్ కుమార్ బండారాన్ని బయటపెడతానని చిరాగ్ అన్నారు. ఇదిలా ఉండగా .. ఈయన ఇంతగా మళ్ళీ పార్టీలో తన ప్రాధాన్యత పెంచుకుంటూ తమది మహాభారత యుద్ధమని, తాము పాండవులమైతే.. తన అంకుల్ పశుపతి కుమార్ పరస్ వర్గం కౌరవులని వ్యాఖ్యానిస్తున్నా పశుపతి నేతృత్వంలోని రెబెల్ వర్గం ఒక్క ప్రకటన గానీ,,ఖండన గానీ చేయకపోవడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. లోక్ సభలో తానే ఎల్ జేపీ నేతనని ప్రకటించుకున్న పశుపతిస్పందన మాత్రం తెలియడంలేదు.
మరిన్ని ఇక్కడ చూడండి: Skin Care : మోచేతులు, మోకాళ్ల దగ్గర నల్లగా ఉందా..! అయితే ఈ 6 మార్గాల ద్వారా వదిలించుకోండి..
Delta Variant: డెల్టా వేరియంట్‌తో యమా డేంజర్.. అప్రమత్తంగా వుండాలంటున్న శాస్త్రవేత్తలు