Delhi Liquor Scam Case: ఢిల్లీలో హైటెన్షన్.. సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ సోదాలు..

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌లో హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట లభించకపోవడంతో ఈడీ మరింత దూకుడు పెంచింది. ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ నివాసానికి చేరుకొని సోదాలు చేస్తున్నారు. లిక్కర్‌ స్కామ్‌లో ఆయన్ని 10 మంది అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Delhi Liquor Scam Case: ఢిల్లీలో హైటెన్షన్.. సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ సోదాలు..
Arvind Kejriwal

Updated on: Mar 21, 2024 | 9:04 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌లో హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట లభించకపోవడంతో ఈడీ మరింత దూకుడు పెంచింది. ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ నివాసానికి చేరుకొని సోదాలు చేస్తున్నారు. లిక్కర్‌ స్కామ్‌లో ఆయన్ని 10 మంది అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. సెర్చ్‌ వారెంట్‌తో కేజ్రీవాల్‌ నివాసానికి చేరుకున్న ఈడీ బృందం.. ఢిల్లీ సీఎంను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లేందుకు యత్నించారు. అయితే ఈడీ ఆఫీసుకు వెళ్లేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు. తనను ఇంట్లోనే ప్రశ్నించాలని కోరారు. సీఎం ఫోన్‌ను అధికారులు సీజ్ చేశారు. సీఎం నివాసానికి వచ్చే అన్ని దారులను పోలీసులు మూసివేసి.. 144 సెక్షన్‌ను అమలు చేశారు. ఇక ఇప్పటికే అక్కడికి చేరుకున్న పలువురు ఆప్ పార్టీ ముఖ్య నేతలు ధర్నాకు దిగారు.

మరోవైపు తనను అరెస్ట్‌ చేయకుండా రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్‌. అయితే అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. కేజ్రీవాల్‌ పిటిషన్‌పై విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. దీంతో ఈడీ అధికారులు వెంటనే యాక్షన్‌ ప్రారంభించారు. మరోవైపు ఆప్‌ నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆప్‌ నేతలు. లిక్కర్‌ స్కాంలో కేజ్రీవాల్‌ ప్రమేయంపై సాక్ష్యాలు సమర్పించాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. దీంతో కేజ్రీవాల్‌పై సాక్ష్యాలను హైకోర్టుకు సమర్పించింది ఈడీ. ఈడీ అధికారులు సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించారు న్యాయమూర్తులు. అయితే సాక్ష్యాలను న్యాయమూర్తి మాత్రమే చూడాలని , పిటిషనర్‌ చూడరాదని కోర్టును అభ్యర్ధించింది ఈడీ.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం..