ఉద్దవ్ పై కార్టూన్, మాజీ నేవీ అధికారిపై ‘సేన’ ఎటాక్

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేపై కార్టూన్ వేసి దాన్ని వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసిన నేవీ మాజీ అధికారి ఒకరిపై ముంబైలో శివసేన కార్యకర్తలు దాడి చేశారు. మదన్ శర్మ అనే ఈయన ముఖంపై పిడిగుద్దులు కురిపించారు..

ఉద్దవ్ పై కార్టూన్, మాజీ నేవీ అధికారిపై సేన ఎటాక్

Edited By:

Updated on: Sep 12, 2020 | 12:06 PM

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేపై కార్టూన్ వేసి దాన్ని వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసిన నేవీ మాజీ అధికారి ఒకరిపై ముంబైలో శివసేన కార్యకర్తలు దాడి చేశారు. మదన్ శర్మ అనే ఈయన ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. ఈ ఎటాక్ లో ఆయన కంటికి గాయమై నెత్తురోడింది. తన అపార్ట్ మెంట్ నుంచి బయటకి వచ్చిన మదన్ శర్మ ను వారు వెంబడి తరిమి మరీ కొట్టిన వీడియోను మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, మరికొందరు పార్టీ నేతలు విడుదల చేశారు. ఈ కార్టూన్ ని తాను కేవలం తమ అపార్ట్ మెంట్ సొసైటీ సభ్యులకు మాత్రమే షేర్ చేశానని శర్మ పేర్కొన్నారు. కాగా ఈ ఎటాక్ ని బీజేపీ నేతలు ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు  ఆరుగుర్ని  అరెస్ట్ చేశారు. శివసేన గూండాలు 65 ఏళ్ళ మాజీ నేవీ అధికారిని కొట్టడం దారుణమని, ఇది ఆటవిక రాజ్యమని ఫడ్నవీస్ పేర్కొన్నారు.