Watch Video: ట్రైనీ IAS పూజా ఖేడ్కర్ తల్లి మరో ఘనకార్యం.. ట్రక్‌ డ్రైవర్‌ను కిడ్నాప్‌ చేసి ఇంట్లోనే దుఖాణం!

ఛీటింగ్‌ వ్యవహారంలో సస్పెండ్‌ అయిన ఐఏఎస్ ప్రొబెషనర్ పూజా ఖేద్కర్ గతంలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. పూజ తల్లి తుపాకీ పట్టుకుని దాడి చేస్తున్న వీడియో ఒకటి బయటికి రావడంతో అప్పట్లో తల్లీకూతుళ్లు తెగ వైరల్‌ అయ్యారు. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఐరోలిలో ఓ ట్రక్ డ్రైవర్ కిడ్నాప్..

Watch Video: ట్రైనీ IAS పూజా ఖేడ్కర్ తల్లి మరో ఘనకార్యం.. ట్రక్‌ డ్రైవర్‌ను కిడ్నాప్‌ చేసి ఇంట్లోనే దుఖాణం!
Ex-IAS Probationer Puja Khedkar Mother Kidnap case

Updated on: Sep 14, 2025 | 8:09 PM

పూణె, సెప్టెంబర్‌ 14: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ గురించి తెలియని వారుండరు. ఛీటింగ్‌ వ్యవహారంలో సస్పెండ్‌ అయిన ఐఏఎస్ ప్రొబెషనర్ పూజా ఖేద్కర్ వార్తల్లో నిలిచారు. పూజ తల్లి తుపాకీ పట్టుకుని దాడి చేస్తున్న వీడియో ఒకటి బయటికి రావడంతో అప్పట్లో తల్లీకూతుళ్లు తెగ వైరల్‌ అయ్యారు. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఐరోలిలో ఓ ట్రక్ డ్రైవర్ కిడ్నాప్ అయ్యాడు. ఈ డ్రైవర్ పూణేలోని చతుశృంగి ప్రాంతంలోని పూజా ఖేడ్కర్ ఇంట్లో దొరకడం కలకలం రేపింది.

సామాజిక కార్యకర్త విజయ్ కుంభార్ ట్వీట్ చేయడం ద్వారా సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విజయ్ కుంభార్ తన పోస్ట్‌లో వివాదాస్పదంగా సస్పెండ్ అయిన ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తల్లి చేసిన మరో దారుణం మీ ముందుకు వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 13న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో, ములుండ్ నుంచి ఐరోలి రోడ్డులోని ఐరోలి ప్రాంతంలోని సిగ్నల్ వద్ద ఓ ట్రక్‌ డ్రైవర్‌ను కిడ్నాప్ అయ్యాడు. బాధితుడు తుర్భే MIDC నవీ ముంబై నివాసి అయిన ప్రహ్లాద్ కుమార్ (22). ప్రహ్లాద్‌ కుమార్ తన మిక్సర్ ట్రక్కును తీసుకెళ్తుండగా MH 12RT 5000 నంబర్‌ ఉన్న కారును మిక్సర్ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అతన్ని బలవంతంగా తమ కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేశారు. దీంతో అతడు కనిపించడం లేదని రబాలే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఇవి కూడా చదవండి

కిడ్నాప్‌కు గురైన డ్రైవర్‌ ఎలా బయటపడ్డాడంటే..

నేరం దర్యాప్తులో భాగంగా అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఖరత్ కారును ట్రాక్ చేయడానికి పూణేకు వెళ్లగా.. అక్కడ చతుశృంగి ప్రాంతంలోని వివాదాస్పద ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ ఇంట్లో లొకేషన్‌ కనిపించింది. API ఖరత్, అతని టీం పూజా ఖేడ్కర్‌ ఇంటికి వెళ్లి కిడ్నాప్‌ అయిన డ్రైవర్‌ను రక్షించినట్లు విజయ్ కుంభార్ తన ట్వీట్‌లో తెలిపారు. దర్యాప్తు సమయంలో పూజా ఖేడ్కర్ తల్లి పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. కనీసం తలుపు కూడా తెరవలేదు. అనంతరం పోలీసులు వారిని రబాలే పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. మరోవైపు పోలీసులు పూజా ఖేడ్కర్‌ తల్లి కిడ్నాప్‌ వ్యవహహారంపై పోలీసులు మగ్ర దర్యాప్తు చేపట్టారు. గతంలోనూ పూజా ఖేడ్కర్ తల్లి బెదిరింపుల వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక ఈ కిడ్నాప్ కేసు పూజా ఖేడ్కర్‌కు మరిన్ని సమస్యలను తెచ్చిపెట్టనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.