VK Sasikala: తమిళనాడులో వేడెక్కుతున్న రాజకీయాలు.. 7న చెన్నైకి రానున్న చిన్నమ్మ.. గ్రాండ్‌ వెల్‌కమ్‌‌కు సన్నాహలు..

|

Feb 04, 2021 | 12:20 PM

Ex-AIADMK Leader VK Sasikala: జయలలిత నిచ్చెలి.. శశికళ జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఆమెకు మద్దతుగా..

VK Sasikala: తమిళనాడులో వేడెక్కుతున్న రాజకీయాలు.. 7న చెన్నైకి రానున్న చిన్నమ్మ.. గ్రాండ్‌ వెల్‌కమ్‌‌కు సన్నాహలు..
Follow us on

Ex-AIADMK Leader VK Sasikala: జయలలిత నెచ్చెలి.. శశికళ జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఆమెకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. శశికళకు అన్నాడీఎంకే కార్యకర్తలు మద్దతివ్వాలంటూ స్వయంగా అన్నాడీఎంకేలోని పలువురు ఫ్లెక్సీలు కట్టడం వివాదాస్పదంగా మారింది. దీనిపై అధికార వర్గం సీరియస్ అయింది. పోస్టర్లు అంటించిన ఐదుగురు అన్నాడీఎంకే కార్యకర్తలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై ఎంఎస్ శశికళ మేనల్లుడు ధినకరన్ స్పందించారు. అమ్మ అభిమానులంతా చిన్నమ్మకు మద్దతిస్తారని.. ఈ ఎన్నికల్లో శశికళ కీలకపాత్ర పోషిస్తారని ఆయన పేర్కొన్నారు.

గ్రాండ్ వెల్‌కమ్‌కు ఏర్పాట్లు..
7న చిన్నమ్మ శశికళ బెంగళూరు‌ నుంచి తమిళనాడులో అడుగుపెట్టనున్నట్లు దినకరన్ పేర్కొన్నారు. ఈ మేరకు భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడు సరిహద్దుల్లోని హోసూర్ సమీపంలోని ఆమెకు స్వాగతం పలుకుతామని.. కార్యకర్తలు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 7 న ఉదయం 9 గంటలకు బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా చెన్నైలోని టి నగర్ నివాసానికి చేరుకోనున్నారు. అయితే జయలలిత స్మరక చిహ్నం వద్దకు కూడా వెళ్లనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో అన్నాడీఎంకే జెండాలు ఉపయోగించొద్దంటూ ఇప్పటికే అధికార పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలాఉంటే.. శశికళ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన రోజు పార్టీ జెండాను కారుపై వినియోగించడం ఇప్పటికే వివాదాస్పదమైంది.

Also Read:

మరోసారి సామాన్యుడిపై గుదిబండ.. పెరిగిన గ్యాస్ ధర.. ఎంత పెరిగిందంటే..?

ఒకప్పుడు దేశంలో అత్యంత సంపన్నుడు.. నేడు ఆస్తులమ్ముకునే స్టేజ్, అమెజాన్ ను అలెగ్జాండర్‌ తో పోల్చిన కిషోర్